AP News: బైక్‌పై హెల్మెట్స్ లేకుండా చిక్కారో.. అవి కూడా వడ్డింపు.. అదీ లెక్క..

AP News: బైక్‌పై హెల్మెట్స్ లేకుండా చిక్కారో.. అవి కూడా వడ్డింపు.. అదీ లెక్క..


రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్‌ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు ట్రాఫిక్‌ పోలీసులు. దానిలో భాగంగా.. విజయవాడ సిటీలో కొద్దిరోజులుగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. సిటీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్‌ వాడకుంటే జరిమానా విధించడంతోపాటు.. వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. పనిలో పనిగా హెల్మెట్‌ వినియోగంతోపాటు పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపైనా కొరఢా ఝుళిపిస్తున్నారు విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు. విజయవాడ సిటీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు పెండింగ్‌ చలాన్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే.. స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలానాలు, హెల్మెట్ ధరించని వారి నుంచి పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఏపీలో వాహనదారులు హెల్మెట్ నిబంధనను పోలీసులు అమ‌లు చేయ‌క‌పోవ‌టంపై ఈ మధ్యే హైకోర్టు అస‌హ‌నం వ్యక్తం చేసింది. హెల్మెట్‌ వాడకాన్ని పోలీసులు సీరియ‌స్‌​గా తీసుకోవ‌టం లేద‌ని మండిపడింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు చాలా మంది హెల్మెట్ లేక‌పోవ‌టం వ‌ల్ల 667 మంది మృతి చెందారని పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరణాలకు ఎవ‌రు బాధ్యత వ‌హిస్తార‌ని ప్రశ్నించింది. దాంతో.. హెల్మెట్ మస్ట్ రూల్‌ను పక్కాగా అమలు చేసే పనిలో పడ్డారు. హెల్మెట్ రూల్‌ని తప్పనిసరి చేస్తూ స్ట్రిక్ట్‌గా డ్రైవ్ చేపట్టారు. ఓ వైపు అవగాహన కల్పిస్తూనే మరోవైపు జరిమానా విధిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *