AP News: తండ్రి రాసిన మరణశాసనం.. సుపారీ ఇచ్చి కొడుకు హత్య

AP News: తండ్రి రాసిన మరణశాసనం.. సుపారీ ఇచ్చి కొడుకు హత్య


చిత్తూరు పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. కొడుకు వేధింపులు భరించలేక సుపారీ ఇచ్చి హత్య చేయించాడు తండ్రి. బోయకొండకు వెళ్లే మార్గంలో లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో స్థానికులు గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మృతుడు మదనపల్లె మండలం దిగువ మామిడి గుంపలపల్లికు చెందిన 36 ఏళ్ల సోమశేఖర్ రెడ్డిగా గుర్తించారు

ఏం జరిగింది? మర్డర్ వెనుకన్న వివాదం ఏంటి?

సోమశేఖర్ రెడ్డి వేధింపులు తాళలేక 10 ఏళ్ల క్రితం భార్య, ఐదేళ్ల కుమారుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో సోమశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి గంగుల రెడ్డికి జైలు శిక్ష పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా అందరితో గొడవ పడుతున్నాడు సోమశేఖర్ రెడ్డి. మరో పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. డబ్బుల కోసం తల్లిదండ్రులతో తరుచూ గొడవపడుతున్నాడు. వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఈ వేధింపులు తాళలేక 40 వేల రూపాయల సుపారీ ఇచ్చి సోమశేఖర్‌ను హత్య చేయించాడు తండ్రి గంగుల రెడ్డి. 15 రోజుల క్రితం పథకం ప్రకారం సోమశేఖర్ రెడ్డిని బోయకొండ అటవీ ప్రాంతంలో హతమార్చారు అమర్, రమేష్ అనే యువకులు.  కొడుకు హత్యకు సుపారీ ఇచ్చిన తండ్రి గంగుల రెడ్డితోపాటు అమర్, రమేష్ అనే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *