Andhra Pradesh: భర్త కనిపించడం లేదంటూ భార్య ఫిర్యాదు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..!

Andhra Pradesh: భర్త కనిపించడం లేదంటూ భార్య ఫిర్యాదు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..!


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. భర్త కనిపించడం లేదంటూ 50 రోజుల క్రితం చేసిన ఫిర్యాదు ఎట్టకేలకు మర్డర్ కేసుగా మారింది. దృశ్యం సినిమాను తలపించేలా దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది.
వివరాల్లోకి వెళితే హత్యకు గురైన ప్రభాకర్ వృత్తిరీత్యా ఎలక్ట్రిషన్. అన్నమయ్య జిల్లా పుల్లంపేట కు చెందిన ప్రభాకర్ పదేళ్ల క్రితం ఎలక్ట్రిషన్ పనుల కోసం శ్రీకాళహస్తికి వచ్చాడు. కొత్తపేటలో ఉన్న స్నేహితుడి తో కలిసి అద్దెలో ఉంటున్నాడు. పనులేని రోజుల్లో ఇంటికి వెళుతూ వస్తున్న ప్రభాకర్‌కు శ్రీకాళహస్తిలో ఉన్న వెంకటేష్ కుటుంబంతో సంహిత సంబంధం ఏర్పడింది. అడపాదడపా వారింటికి వచ్చి వెళ్తున్నాడు ప్రభాకర్.

ఏర్పేడు మండలం పల్లం గొల్లపల్లికి చెందిన వెంకటేష్, వసంత దంపతులది వ్యవసాయ కుటుంబం. శ్రీకాళహస్తిలోని కొత్తపేటలో కాపురంటూ సొంతూరులో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. వెంకటేష్, వసంత దంపతులతో ప్రభాకర్‌కు మరింత చనువు పెరిగింది. ఇలా వసంతతో ప్రభాకర్‌కు మధ్య స్నేహం పెరగడం, వెంకటేష్ మందలించడం కూడా జరిగింది. అయినా భార్య వసంత తీరు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. వెంకటేష్, వసంత మద్య నాలుగు నెలల క్రితం జరిగిన గొడవతో వెంకటేష్ సొంతూరుకు వెళ్లి పోయాడు. అయినా వసంత మాత్రం శ్రీకాళహస్తిని ఉంది పోయింది.

ప్రభాకర్, వసంతల మధ్య పరిచయం వివాహేతర సంబంధం దాకా వెళ్ళిందని భావించిన వెంకటేష్ తన భార్య దూరమయ్యేందుకు ప్రభాకర్ కారణమన్న కోపంతో పక్కా ప్లాన్ వేశాడు. బామ్మర్ది అయిన ఆటోడ్రైవర్ సుబ్రహ్మణ్యం, అల్లుడు హేమంత్ కుమార్‌తో కలిసి ప్రభాకర్‌ను అంతం చేసేందుకు పథకం వేశారు. అక్టోబర్ 24న మందు పార్టీకి ప్రభాకర్‌ను పిలిచారు. ప్రభాకర్ తోపాటు నలుగురు ఫుల్‌గా మద్యం సేవించారు. ఆ తరువాత ప్రభాకర్ తోపాటు నలుగురు ఆటోలో పల్లం గొల్లపల్లి శివారులోని స్మశానం వద్దకు చేరుకున్నారు. అప్పటికే మత్తులో నిద్రలోకి జారుకున్న ప్రభాకర్‌ను ముగ్గురు కలిసి బండ రాళ్లతో కొట్టి హత్య చేశారు. కాలువ పక్కనే ప్రభాకర్ డెడ్‌బాడీని పూడ్చిపెట్టారు.

అయితే, కొత్తపేటలో ప్రభాకర్ తో కలిసి అద్దె ఇంట్లో ఉన్న స్నేహితుడికి డౌట్ వచ్చింది. నాలుగు రోజులైనా ప్రభాకర్ రాకపోవడంతో, కనిపించడం లేదంటూ ప్రభాకర్ భార్య సుధాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. భర్త ప్రభాకర్ ఆచూకీ కోసం అన్నిచోట్ల గాలించిన భార్య సుధా నవంబర్ 25న శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ప్రభాకర్‌తో సన్నిహితంగా మెలిగిన వసంతపై డౌట్ వచ్చింది.

ఈమేరకు లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రభాకర్ ను హత్య చేసింది వసంత భర్త వెంకటేష్, ఆమె తమ్ముడు సుబ్రహ్మణ్యం, అల్లుడు హేమంత్ కుమార్ లేనని పోలీసులు తేల్చారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పల్లం గొల్లపల్లిలో ప్రభాకర్ డెడ్‌బాడీని పూడ్చిపెట్టిన స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. ఎట్టకేలకు మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. అచ్చం మరోసారి దృశ్యం సినిమా లాంటి సీన్ మరోసారి వెలుగులోకి వచ్చింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *