Andhra Pradesh: ఇంటికి పార్శిల్ వచ్చిందని తెరిచి చూస్తే.. గుండె ఆగినంత పనైంది..

Andhra Pradesh: ఇంటికి పార్శిల్ వచ్చిందని తెరిచి చూస్తే.. గుండె ఆగినంత పనైంది..


ఏదైనా వస్తువును మనం ఆన్లైన్లో గాని, ఇతరత్రా మాధ్యమాల ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు పార్సిల్ మన ఇంటి దగ్గరికే వస్తుంటాయి. కొందరైతే ఆ పార్సెల్ ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, సడన్ గా ఓ ఇంటికి ఓ పార్సెల్ వచ్చింది. ఆత్రుతగా ఆ పార్సిల్ ఓపెన్ చేశారు. ఇంకేముంది ఏదో వస్తుంది అనుకుంటే మరేదో వచ్చింది. అయితే పార్సిల్ లో వచ్చిన దాన్ని చూసి వారికి గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ పార్సెల్లో ఓ డెడ్ బాడీ ఉంది.. వెంటనే పరుగులు పెడుతూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం చెప్పి పోలీసులను అక్కడికి తీసుకువచ్చారు. దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఆ పార్సిల్ ఎవరికి వచ్చింది.. పార్సిల్ లో ఉన్న డెడ్ బాడీ ఎవరిది..? పోలీసులు విచారణ ఏ కోణంలో చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో పార్సిల్ లో డెడ్ బాడీ తీవ్ర కలకలం రేపింది. యండగండి గ్రామంలో రంగరాజు అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సాగి తులసి నిడదవోలుకు చెందిన శ్రీనివాసరాజు తో వివాహం అక్కడే నివాసం ఉండేవారు.. అయితే ఆమె భర్త అప్పులు చేసి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడి నుంచి వచ్చి పాలకోడేరు మండలం గరగపర్రులో తన కుమార్తెతో కలిసి జీవిస్తుంది.

కుటుంబ పోషణ నిమిత్తం తులసి భీమవరం దుర్గ స్టిల్స్‌లో ఉద్యోగం చేస్తుంది. అయితే తులసికి గత ప్రభుత్వంలో తన తండ్రి స్వగ్రామమైన యండగండిలో ఇంటి స్థలం మంజూరు అయ్యింది. దాంతో ఆమె ఆ స్థలంలో ఇల్లు కట్టడం ప్రారంభించింది. ఆమె పరిస్థితి గుర్తించిన క్షత్రియ సేవా సమితి ఫౌండేషన్ ఆమెకు ఇల్లు కట్టుకోవడంలో ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్ కి వచ్చింది. ఆ ఇంటికి కావలసిన సామాన్లు యండగండిలో తండ్రి రంగరాజు ఇంటికి పార్సిల్ ద్వారా వెళుతుంటాయి. ఏమేమి వస్తువులు ఎప్పుడు వస్తాయి అనేది ఆమెకు వాట్స్అప్ ద్వారా సమాచారం అందిస్తారు.. గతంలో కూడా ఇంటికి కావలసిన పెయింట్ డబ్బాలు, టైల్స్ తన తండ్రి ఇంటికి పార్సిల్ ద్వారా వచ్చాయి.

ఆ క్రమంలోనే ఇంటికి కావలసిన కరెంటు సామాన్లు మోటారు వస్తాయని తులసికి నిన్న వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది.. ఆ సామాన్లు వస్తాయని వారు ఎదురుచూస్తున్నారు. ఈలోపు ఒక చెక్క పెట్టలో పార్సిల్ వచ్చింది. ఎలక్ట్రిక్ మోటార్, కరెంటు సామాన్లు అందులో ఉన్నాయని ముందుగా భావించారు.. ఆ చెక్క పెట్టకు ఒక తాళంకప్పతో లాక్ చేసి ఉంది. అయితే ఆ చెక్క పెట్టకు ఒక కవర్ పెట్టి ఆ కవర్లో చెక్క పెట్టి తాళం కప్ప తాళాన్ని ఉంచారు. అంతేకాక అందులో పేపర్ పై రాసిన ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ ఓపెన్ చేసి చూడగా అందులో మీరు కోటి 30 లక్షలు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని రాసి ఉంది. వెంటనే కంగారుపడి అసలు ఆ పెట్టెలో ఏముంది అని కవర్లో ఉన్న తాళంతో పెట్టెను ఓపెన్ చేసి చూస్తే మూడు నాలుగు కవర్లలో చుట్టి పెట్టి ఉన్న ఒక డెడ్ బాడీ కనిపించింది.

అది చూడగానే వారికి గుండె ఆగిపోయినంత పని అయింది. వెంటనే హుటాహుటిన ఉండి పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసి విషయం పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు యండగండి వచ్చి పార్సిల్ లోనే డెడ్ బాడీని పరిశీలించారు.. అది సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని ఒక మగ వ్యక్తి మృతదేహంగా గుర్తించారు. వెంటనే క్లూస్ టీం బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఆ పార్సెల్ ఎవరు తెచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, మృతదేహం వివరాలను పూర్తిగా విచారణ చేస్తున్నారు పోలీసులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *