Andhra News: ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..

Andhra News: ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..


గంజాయి స్మగ్లింగ్ పై నిఘా పెరగడంతో.. స్మగ్లర్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల రైల్వే స్టేషన్‌లో అనుమానితులను పట్టుకొని డ్రై ఫ్రూట్స్ పార్సల్స్‌గా గంజాయిని తరలిస్తున్న వ్యవహారాన్ని రైల్వే పోలీసులు బట్టబయలు చేశారు. ఆ తర్వాత పోలీసులు సిటీలో కూడా నిఘా పెంచి.. కొరియర్ సర్వీస్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న గంజాయి గుట్టును రట్టుచేస్తున్నారు.. తాజాగా జరిగిన ఘటన అంతకు మించి అనేలా అందరినీ షాక్ కు గురిచేసింది. ఢిల్లీకి కోరియర్ పంపితే.. విశాఖలోని ఓ పాడుబడ్డ ఇంట్లో గుట్టగుట్టలుగా గంజాయి బయటపడటం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఓ పార్సెల్ కొరియర్ అయింది.. ఢిల్లీలో ఆ అడ్రస్ తప్పుగా ఉండడంతో అక్కడ పార్సిల్ బాయ్ కి అనుమానం వచ్చింది. ఆ సమాచారాన్ని విశాఖలోని పార్సల్ సంస్థకు అందించి తిరిగి ఆ పార్శిల్ ను వెనక్కి పంపారు. దీనిపై పోలీసులకు సైతం సమాచారం అందించారు.. వెరిఫై చేస్తే అందులో ఉన్నది గంజాయి అని తేలింది.. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

Ganja Case

పాడుబడిన ఇంట్లో…

ఆ పార్సల్ పంపిన అడ్రస్‌ను తెలుసుకున్న పోలీసులు వెరిఫై చేశారు. శ్రీహరిపురం ప్రాంతంలోని 60 వ వార్డు ఎంఐజి 1.. 22-65-5-22 క్వార్టర్ గా గుర్తించారు పోలీసులు. అది ఒక పాడుబడిన ఇల్లు. ప్రమోద్ అనే వ్యక్తి పేరు పై ఆ ఇల్లు ఉంది. అయితే.. అక్కడికి వెళ్లిన పోలీసులు వెరిఫై చేసేసరికి ఇంట్లో 100 కిలోల గంజాయి బయటపడింది. అక్కడ ఎవరూ లేరు.

ఆ ఇంటిని నెలకు 9వేల రూపాయలకు యజమాని అద్దెకిచ్చినట్టు.. అందులో బీహార్ కు చెందిన యువకులు నివాసం ఉంటున్నట్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇంటిని సీజ్ చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *