సంధ్య థియేటర్ తొక్కిసలాట ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్‌కు పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారణ చేపట్టారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు విషయాన్ని పోలీస్ శాఖ సీరయస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈసారి హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తోంది. అందుకే సీసీటీవీ ఫుటేజీ, ఘటనజరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోందట విచారణ బృందం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు విచారణ జరపడం ఆసక్తికరంగా మారింది.
ఈనెల 4న రాత్రి 9.30 ప్రాంతంలో సంధ్య థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించి పలు వీడియోలు బయటపెట్టారు. అయితే అంతకుముందు రోజు అల్లు అర్జున్ కూడా ప్రెస్‌మీట్ నిర్వహించి తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. ఘటన జరిగినట్లు తర్వాతి రోజు తెలిసిందని.. ఆ వార్త విని కుంగిపోయానన్నాడు అల్లు అర్జున్.
అయితే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్‌కు దిగుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా అల్లు అర్జున్‌ను మరోసారి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. అయితే, ఏయే అంశాలపై స్టేట్‌మెంట్ రికార్డు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ మధ్యంతర బెయిల్‌పై ఉండటంతో జనవరి 21 వరకైతే అరెస్ట్ ఛాన్స్ లేదు. కానీ, బెయిల్ రద్దుపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ప్రత్యేకించి బెయిల్ రూల్స్‌కు విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టారనేది పోలీసుల వాదన. అంతేకాదు, సంధ్య థియేటర్‌కి వెళ్లొద్దని చెప్పినా వెళ్లారని ఆధారాలను వీడియోలను బయటపెట్టారు. ఇక ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ చెప్పిన అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు సిద్ధం చేశారట. పోలీసుల వీడియో ఆధారంగానే అల్లు అర్జున్‌పై ప్రశ్నలు సంధించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఔట్‌పుట్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..