Allu Arjun Arrest: ఎవ్వరు చేసిన తప్పు తప్పే.. చట్టం తనపని తాను చేసుకుపోతుంది.. సీఎం రేవంత్ రెడ్డి

Allu Arjun Arrest: ఎవ్వరు చేసిన తప్పు తప్పే.. చట్టం తనపని తాను చేసుకుపోతుంది.. సీఎం రేవంత్ రెడ్డి


అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనం సృష్టిస్తుంది. ఈ రోజు ఉదయం ఎవ్వరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఆమె కొడుకు హాస్పటల్ లో ఉన్నారు. ఈ ఘనటనలో అల్లు అర్జున్ ను ఏ 11గా చేర్చారు పోలీసులు. దాంతో ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో పోలీసుల చర్యను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించారు, వారు తమ పని తాము చేస్తున్నారని పేర్కొన్నారు రేవంత్ పేరుకొన్నారు. డిసెంబర్ 4న పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో ప్రదర్శనకు ముందు సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మరణించింది అలాగే ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోలేదు. అతను కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి, అభిమానులను ఉత్సాహపరుస్తూ, అభివాదం చేశాడు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి తనకు బంధువు అయినప్పటికీ, అల్లు అర్జున్ ను అరెస్టు చేయాలనే నిర్ణయం తీసుకునే దానిలో ఎక్కడా కుటుంబాన్ని రానివ్వలేదని రేవంత్ పేర్కొన్నారు.

కాగా అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులు 14 రోజులు రిమాండ్ విధించింది. అలాగే హైకోర్టులో అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటీషన్ ను తిరస్కరించింది. దాంతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా చివరి నిమిషంలో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. అలాగే అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *