Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం


సినీ నటుడు అల్లు అర్జున్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో భాగంగా చిక్కడ పల్లి పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇది అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు అందరినీ షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా బన్నీ అరెస్ట్ పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంబటి రాంబాబు ఈ విషయంపై స్పందించారు. ఈ మేరకు అల్లు అర్జున్ అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తూ ఆయన ట్వీట్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ను కనీసం దుస్తులు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా నేరుగా బెడ్ రూం నుండి తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య, అగౌరవకరం. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఆయన స్థాయికి ఇది ఏ మాత్రం సముచితం కాదు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం చెందడం చాలా దురదృష్టకరం, అయితే భారీ జనసందోహాన్ని అదుపు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది ఎత్తిచూపుతోంది ‘పుష్ప: ది రైజ్’ అఖండ విజయం తర్వాత అభిమానులు ‘పుష్ప: ది రూల్’ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతటి హైప్రొఫైల్ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే అసలైన వైఫల్యం. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఐకాన్ స్టార్, అతని అభిమానులు గౌరవం, క్రమశిక్షణకు మారుపేరు.వారిని నేరస్థులుగా చూడొద్దు’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు బండి సంజయ్.

పుష్ప 2 ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాటలో రేవంతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య యాజమాన్యం అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బందిపై కేసు నమోదైంది. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు హీరో అల్లు అర్జున్‌. సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్‌ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి

బండి సంజయ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *