Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మద్దతుగా సెలబ్రెటీలు.. ట్వీట్లు చేస్తున్న సినీ తారలు

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మద్దతుగా సెలబ్రెటీలు.. ట్వీట్లు చేస్తున్న సినీ తారలు


అల్లు అర్జున్ కు మద్దతుగా సినీ సెలబ్రెటీలు రాజకీయ నాయకులు వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ను పోలీసులు ఈ రోజు( శుక్రవారం) ఉదయం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ ఘటన పై చిక్కడ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను ఏ 11గా చేర్చారు పోలీసులు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. కాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేశారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో సీని సెలబ్రెటీలు, రాజకీయనాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.

అల్లు అర్జున్ కు మద్దతుగా వరుసగా ట్వీట్స్ చేశారు. ఉదయం నుంచి చాలా మంది సెలబ్రెటీలు అల్లు అర్జున్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. నాని, శ్రీవిష్ణు, నితిన్‌ ఇలా చాలా మంది ట్వీట్స్ చేశారు. అల్లు అర్జున్‌ తరఫున నిలబడుతానన్న అన్నారు మెహర్‌ రమేష్‌. అరెస్టును ఖండించిన మెహర్‌. అలాగే జరిగిన ఘటన దురదృష్టకరం.. కానీ దానికి ఒక్కరినే బాధ్యుడిని చేయడం బాధాకరం… అల్లు అర్జున్‌ తో మేమున్నాం అన్నారు యంగ్ హీరో ఆది సాయికుమార్‌. అలాగే తొక్కిసలాటకు ఒక్కరు ఎలా బాధ్యులవుతారంటూ ప్రశ్నించాడు సందీప్‌ కిషన్‌. ఘటన బాధాకరమే, కానీ ఒక్కడినే బాధ్యుడిని చేయడం బాలేదన్న దర్శకుడు గోపీచంద్‌ మలినేని.

ఇవి కూడా చదవండి

ప్రజా రక్షణ అందరి బాధ్యత.. మేం అల్లు అర్జున్‌ వైపున్నామంటున్న శ్రీవిష్ణు.  సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో అది నిజంగా దురదృష్టకరం, దారుణం.. ఒక తల్లి ఆరోజు ప్రాణాలు కోల్పోయింది.. కానీ ఈరోజు అల్లు అర్జున్ గారి పట్ల జరిగింది మాత్రం చాలా కఠినమైన చర్య.. ఒక దారుణమైన ఘటనతో ఇంకోటి ఫాలో అయిందని అడవి శేష్ అన్నారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో అది బాధాకరం.. ఇంకా బెటర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ తీసుకుని ఉండుంటే బాగుండేది.. ఈ ఘటనకు అల్లు అర్జున్ గారిని బాధ్యులను చేయడం దారుణం. తన పరిధిలో లేని విషయాన్ని అల్లు అర్జున్ కి రిలేట్ చేయడం అకారణంగా అనిపిస్తుంది. బాధిత కుటుంబానికి అండగా నిలబడతానని ఇప్పటికే అల్లు అర్జున్ గారు హామీ ఇచ్చారు.. బ్లేమ్ గేమ్ తో దాన్ని కనపడనీయకుండా చేయకండి అని అనిల్ రావిపూడి రాసుకొచ్చారు.  అందమా భామ రష్మిక స్పందిస్తూ.. నేను ఇప్పుడు ఏం చూస్తున్నానో అర్థం కావట్లేదు.. నమ్మలేకపోతున్నాను. జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం.. చాలా భాధాకరం .. జరిగిన మొత్తం ఘటనను ఒక్క వ్యక్తి మీద తోయడం.. అతన్నే బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండు సందర్భాల్లో జరిగిన ఘటన నిజంగా బాధాకరం, దురదృష్టకరం అని రష్మిక రాసుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *