Allu Arjun: ‘శ్రీతేజ్‌ను అందుకే కలవలేకపోతున్నా.. నిత్యం దేవుడిని ప్రార్థిస్తున్నా’.. అల్లు అర్జున్ ఎమోషనల్

Allu Arjun: ‘శ్రీతేజ్‌ను అందుకే కలవలేకపోతున్నా.. నిత్యం దేవుడిని ప్రార్థిస్తున్నా’.. అల్లు అర్జున్ ఎమోషనల్


సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీ తేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు.
త్వరలోనే బాలుడిని కలుస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘నేను నిత్యం శ్రీతేజ్‌ గురించి ఆలోచిస్తున్నా. దురదృష్టవశాత్తూ ఆ ఘటన జరిగింది. ప్రస్తుతం శ్రీతేజ చికిత్స తీసుకుంటున్నాడు. లీగల్‌ ప్రొసీడింగ్స్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను. శ్రీతేజ్‌నీ, అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవొద్దని సూచించారు. నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తాను. వైద్య, కుటుంబపరమైన అవసరాలను తీరుస్తాను. ఆ కుటుంబానికి సంబంధించి బాధ్యతలను తీసుకుంటాను. శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలి. త్వరలోనే అతన్ని, అతని కుటుంబాన్ని కలుసుకుంటానని ఆశిస్తున్నాను’ అని అల్లు అర్జున్ తెలిపారు.

తీవ్ర మనస్థాపంలో పుష్ప టీమ్.. ఆస్పత్రి ఖర్చులన్నీ భరిస్తూ..

కాగా సంధ్య థియేటర్ దుర్ఘటన తరువాత హీరో అల్లు అర్జున్, నిర్మాతలు రవిశంకర్, నవీన్‌ ఎర్నేని, దర్శకుడు సుకుమార్‌తో పాటు పుష్ప-2 టీమ్‌ అంతా తీవ్ర మనస్తాపంలో వున్నారు. ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ హస్పిటల్‌ ఖర్చులు హీరో అల్లు అర్జున్‌తో పాటు మైత్రీ మూవీస్‌ నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నారు. దుర్ఘటన జరిగిన రోజు నుంచి హస్పటల్‌ ఖర్చులు తమ బాధ్యతగా స్వీకరించారు. భవిష్యత్‌లో కూడా శ్రీతేజ్‌ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైధ్య ఖర్చులన్నీ అల్లు అర్జున్‌తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా వున్నారు. ఇటీవల శ్రీతేజ్‌ వైద్యంలో భాగంగా అవసరమైన ఓ ఇంజెక్షన్‌ను ఖర్చకు వెనుకాడకుండా సింగపూర్‌ను నుంచి తెప్పించారు. ఇటీవల హీరో అల్లు అర్జున్‌ తాను 25 లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు హస్పటల్‌ ఖర్చులు, భవిష్యత్‌లో ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే. దుర్ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్‌, మైత్రీ నిర్మాలు, హీరో అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌ ఎప్పటికప్పుడూ శ్రీతేజ్‌ ఆరోగ్య అప్‌డేట్‌ను తెలుసుకుంటున్నారు. ఆ విషయాలను హీరో అల్లు అర్జున్‌కు తెలియజేస్తున్నారు. ⁠ఇటీవల నిర్మాత బన్నీవాస్‌ తరుచుగా హస్పటల్‌కు కూడా వెళుతూ శ్రీతేజ్‌ యోగాక్షేమాలు కనుక్కుంటున్నారు. శ్రీతేజ్‌ పూర్తి ఆర్యోగంగా కోలుకునేవరకు హీరో అల్లు అర్జున్‌ తరపున వారి అప్‌డేట్‌లను హీరో టీమ్‌ ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారు. త్వరలోనే శ్రీతేజ్‌ కోలుకోవాలని అందరం ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *