Allu Arjun: నా పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్

Allu Arjun: నా పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్


అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ కు ఒక్కరోజు ముందు ప్రీమియర్స్ వేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ అభిమానులను తోసెయ్యడంతో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఓ బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ కూడా చేశారు.

తాజాగా అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన పై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్  ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.. “జరిగిన ఘటన ఒక ప్రమాదం.. ఇందులో ఎవరి తప్పు లేదు. హాస్పటల్ లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.. ఆ ఫ్యామిలీకి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నా.. థియేటర్ నాకు ఓ టెంపుల్ లాంటిది. అభిమానులకు ఏదైనా అయితే ముందు నేనే బాధపడతాను అన్నారు. బయట చేస్తుందంతా అసత్య ప్రచారం. ఈ ఘటన జరగడంతో నేను ఎక్కడికి వెళ్లలేకపోతున్నాను. నేను నా సినిమా థియేటర్ లో చూడలేకపోతున్నాను. ఇంట్లో ఒక్కడినే కూర్చొని 15 రోజుల నుంచి బాధపడుతున్నాను.

నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. నేను తెలుగు సినిమా స్థాయి పెంచడానికి సినిమా చేశా.. నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. సినిమా థియేటర్  లో చూస్తేనే తెలుస్తుంది. మూడేళ్లు కష్టపడ్డాను. థియేటర్ లో చూస్తేనే నేను ఏం చేశానో తెలుస్తుంది. నా మీద వస్తున్నావని అవాస్తవం. అక్కడ రోడ్ షో ఏం చేయలేదు. జనం ఎక్కువైతే నా కారు ఆగిపోయింది. నేను కనిపిస్తేనే జనం జరుగుతారు అని నేను బయటకు వచ్చాను. ఫ్యాన్స్ కు నేను చెప్తేనే వింటారు అందుకే బయటకు వచ్చి అందరిని వెళ్ళమని చెప్పా.. థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నన్ను ఏ పోలీసులు కలవలేదు. నా మ్యానేజర్స్ చెప్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాకు అక్కడ జరిగింది తెలియదు. తర్వాత రోజు నాకు తెలిసింది. నా పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. నా పిల్లలను వదిలేసి నేను ఎలా వెళ్తాను. నాకు తెలిసిన వెంటనే బన్నీ వాసును పంపించా.. నేను కూడా వస్తా అని చెప్పా.. కానీ అప్పటికే నా మీద వాళ్లు కేసు ఫైల్ చేశారు అని చెప్పారు.. అప్పటికీ నేను వెళ్తాను అన్నాను.. కానీ నా లాయర్లు వద్దు అని అన్ను ఆపేశారు. లేకపోతే నా ఫ్యాన్స్ ను కలవకుండా ఉండగలనా..? నేను షాక్ లో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను షాక్ లోనే ఉన్నాను. సినిమా సెలబ్రేషన్స్ మొత్తం ఆపేశాం.. ఆతర్వాత ఓ వీడియో పెట్టాను. నేను ఎప్పటికప్పుడు ఆ బాబు గురించి తెలుసుకుంటూనే ఉన్నాను.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *