సీని హీరో అల్లు అర్జున్ చంచల్ గూడా జైలు నుంచి శనివారం ఉదయం విడుదలయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రూ.50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండ్ కు సమర్పించారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందాయి. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామునే చంచల్ గూడా జైలుకు చేరుకున్నారు అల్లు అరవింద్. కాసపటి క్రితమే జైలు నుంచి విడుదలైన బన్నీ ఇంటికి బయలుదేరారు.