ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న అల్లు అర్జున్ను ఈరోజు ఉదయం 7గంటలకు తరువాత విడుదల చేశారు పోలీసులు. హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో నిన్న విడుదల కావాల్సి ఉండగా.. ప్రొసీజర్ ఆలస్యం అవ్వడంతో ఈరోజు విడుదల అయ్యారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా చేర్చారు. అరెస్ట్ అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తనపై నమోదైన కేసులపై క్వాష్ పిటీషన్ ను వేయగా.. హైకోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. నిన్న మధ్యాహ్నమే మధ్యంతర బెయిల్ కోరుతూ బన్నీ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించగా.. బన్నీకి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. వ్యక్తిగత పూచికతతో బెయిల్ మంజూరు చేయడంతో.. జైలు సూపర్ డెంట్ కు షూరిటీ లు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
ఇవి కూడా చదవండి
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.