అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంతో అభిమానులు షాకయ్యారు. సంధ్య థియేటర్ ఘటనలో తమ హీరోను అరెస్ట్ చేయడంతో భారీ సంఖ్యలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయకపోవడం అల్లు అర్జున్ తప్పు కాదని.. ఈ ఘటనలో తమ హీరోను ఎలా అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. మరోవైపు బన్నీని రిమాండ్ కు తరలించేందుకు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు.
ఈనెల 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై, సినిమా యూనిట్ పై, థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అలాగే సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Democracy in danger. Crowd control and their madness is not the fault of Allu Arjun.#AlluArjun
— Rushik Rawal (@RushikRawal) December 13, 2024
ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.