Allu Arjun: ‘అల్లు అర్జున్‌ను జైలుకు పంపి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు’.. డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్లు

Allu Arjun: ‘అల్లు అర్జున్‌ను జైలుకు పంపి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు’.. డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్లు


సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ శనివారం (డిసెంబర్ 07) తెల్లవారు జామున విడుదలయ్యారు. ఈకేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ బయటకు వచ్చాడు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న బన్నీ పుష్ప 2 సినిమాతో మరోసారి మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు .అంతటి స్టార్‌ ఇమేజ్‌ ఉన్న హీరో అనూహ్యంగా అరెస్ట్‌ కావడంతో భారతీయ సినీ పరిశ్రమ మొత్తం షాక్‌ అయింది. కేంద్రమంత్రులు, స్థానిక రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులందరూ బన్నీ అరెస్ట్ ను ఖండించారు. ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందు నుంచి పుష్ప 2 సినిమాకు, అల్లు అర్జున్ కు మద్దుతుగా నిలుస్తూ ఉన్నారు. తరచూ బన్నీకి సపోర్టుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ‘అల్లు అర్జున్‌ అరెస్ట్‌ విషయంలో అధికారులకు నా 4 ప్రశ్నలు’ అంటూ అందరి దృష్టిని ఆకర్షించిన ఆర్జీవీ మరోసారి సంచలన ట్వీట్ చేశాడు. ‘ తెలంగాణకు చెందిన అల్లు అర్జున్‌ పుష్ప 2తో భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీని అందించి, రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అల్లు అర్జున్‌ను జైలుకు పంపి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చింది.’ అంటూ తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు ఆర్జీవీ.

అల్లు అర్జున్ కుమద్దతుగా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా బన్నీ అభిమానులు ఈ ట్వీట్ ను తెగ వైరల్ చేస్తున్నారు. అంతకుముందు కూడా తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు ఆర్జీవీ. ముఖ్యంగా సమాధానం చెప్పాలని నాలుగు ప్రశ్నలు సందించారు. అందులో 1. పుష్కరాలు, ఉత్సవాలు జరిగినప్పుడు తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?. 2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా?. 3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా?. 4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు?’ అని రామ్ గోపాల్ వర్మ పోలీసులను ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

రామ్ గోపాల్  వర్మ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *