సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను దర్శకుడు కె. రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్ రాజు, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేరవకొండ, హరీశ్ శంకర్ కలిశారు. అల్లు అర్జున్ ను చూసి డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన వీరందరూ తాజా పరిణామాల గురించి చర్చించారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి, అల్లు అర్జున్ మేనత్త సురేఖ సైతం బన్నీ నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ను చూడగానే సురేఖ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
శుక్రవారం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్‌ను విడుదల చేశారు జైలు అధికారులు. సెక్యూరిటీ రీజన్స్‌తో మెయిన్ గేట్ నుంచి కాకుండా.. ప్రిజన్స్ అకాడమీ గేట్ నుంచి బయటికి పంపారు. అల్లు అర్జున్.. జైలు నుంచి బయటికి వెళ్లేటప్పుడు మీడియా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు జైలు అధికారులు. మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్కార్ట్ వాహనాలు ఆరేంజ్ చేశారు. జైలు నుంచి ఇంటికి వెళ్లేవరకూ సెక్యూరిటీ ఇచ్చారు పోలీసులు.
#Sukumar sir ” We Love You ” ♥️🥺@alluarjun #WeStandWithAlluArjun pic.twitter.com/aq4S8cvitj
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 14, 2024
Athamma love for menalludu ♥️@alluarjun #WeStandWithAlluArjun pic.twitter.com/oufJd5H1sx
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 14, 2024
ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.