కొచ్చి, డిసెంబర్ 17: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కాసేపటికే రన్‌వేపై విమానం టైర్ భాగాలు ఊడిపోయి పడిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఈ మేరకు కొచ్చి నుంచి బహ్రెయిన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు SIAL అధికారులు తెలిపారు.
ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం, మంగళవారం (డిసెంబర్ 17) ఉదయం 10.44 గంటలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX471 (AXB471) కొచ్చిన్ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే రన్‌వేపై విమానం టైర్‌లోని భాగాలు ఎయిర్ పోర్టు సిబ్బంది గుర్తించారు. అనంతరం కాసేపటికే రన్‌వేపై వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు తెలియజేశారు. విమానం సుమారు 40 నిమిషాల పాటు గాలిలో ప్రయాణించిన తర్వాత, ఈ సంఘటనను విమాన సిబ్బంది గుర్తించడంతో పైలట్‌లను అప్రమత్తం చేశారు. ATC క్లియరెన్స్ తర్వాత, విమానం తిరిగి కొచ్చి ఎయిర్‌పోర్టులో మధ్యామ్నం 12:32 గంటలకి అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ముందు, నెడుంబస్సేరి విమానాశ్రయంలో విమానాశ్రయ అగ్నిమాపక, రెస్క్యూ సేవలతో సహా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. అదృష్టవశాత్తు అది సేఫ్ ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో పైలట్, క్యాబిన్ సిబ్బందితో సహా మొత్తం 112 మంది ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.