బై నౌ పే లేటర్ సేవలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ క్లార్నా నూతన రిక్రూట్‌మెంట్‌లను నిలిపేసిందని. ఇటీవలే ఆ కంపెనీ సీఈఓ సెబాస్టియన్ సిమియాట్‌కోవ్స్కీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు సాంప్రదాయకంగా మానవ ఉద్యోగులు నిర్వహించే దాదాపు అన్ని పనులను చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల ఓ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో, సిమియాట్‌కోవ్స్కీ ఏఐ కంపెనీలో అనేక పాత్రలను నిర్వహించగలిగే స్థాయికి ఎదిగిందని సూచించారు. ఒక సంవత్సరం క్రితం నుంచే క్లార్నా కొత్త సిబ్బందిని నియమించుకోవడం ఆపివేసిందని దాని వల్ల శ్రామికశక్తి క్రమంగా తగ్గిందని సిమియాట్‌కోవ్స్కీ వెల్లడించారు. గతంలో 4,500 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ ఇప్పుడు 3,500 మందిని కలిగి ఉంది.
సాంకేతిక సంస్థల్లో సాధారణంగా వార్షిక అట్రిషన్ రేటు కారణంగా 20 శాతం రీప్లేస్‌మెంట్‌లు ఉంటాయి. అయితే ఆ స్థానాలను భర్తీ చేసుకోకుండా క్లార్నా వర్క్‌ఫోర్స్‌ను కుదించడాన్ని ఎంచుకుంది. ముఖ్యంగా ఆటోమేషన్ కోసం ఏఐను వినియోగిస్తున్నారు. ఈ మార్పు ఉన్నప్పటికీ ప్రస్తుత ఉద్యోగుల జీతాలు ప్రతికూలంగా ప్రభావితం కాకూడదని సిమియాట్కోవ్స్కీ సూచించారు. వాస్తవానికి తక్కువ మంది సిబ్బంది కారణంగా క్లార్నాకు సంబంధించిన మొత్తం జీతం ఖర్చులు తగ్గుతున్నందున మిగిలి ఉన్న వారికి భారీగా జీతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి ప్రపంచవ్యాప్త చర్చలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది.
మెకిన్సే & కంపెనీ 2023 నివేదిక ప్రకారం ఏఐ అభివృద్ధి చెందుతూనే ఉందని, ముఖ్యంగా 2030 నాటికి మిలియన్ల మంది కార్మికులు కొత్త ఉద్యోగాలు చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త సిబ్బందిని చురుగ్గా నియమించకూడదని క్లార్నా తీసుకున్న నిర్ణయం ఏఐ ఇప్పటికే ఎలా రూపాంతరం చెందుతోందనేదానికి ఒక నిర్దిష్ట ఉదాహరణగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. క్లార్నా వెబ్‌సైట్‌లో కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నప్పటికీ ఇంజనీరింగ్‌లో ముఖ్యమైన పాత్రలకు మాత్రమే నియామకాలు చేస్తున్నారని వివరిస్తున్నారు. కాలక్రమేణా ఏఐ వారి కార్యకలాపాల్లో విలీనం అవుతున్నందున టెక్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్ వ్యూహాలను క్రమంగా సర్దుబాటు చేస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి