కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలు సైతం వచ్చాయి. అంతేకాదు.. ఇళయరాజాగా ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ అయ్యింది. తాజాగా ధనుష్ మరో బయోపిక్ చేయనున్నాడట. ఇండస్ట్రీలోని ప్రముఖ లెజెండరీ జీవితకథలో ధనుష్ నటిస్తున్నారని అంటున్నారు. ధనుష్ ప్రస్తుతం తన 52వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ధనుష్‌కి చెందిన వండర్ బార్ ,డాన్ పిజర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు రాజ్‌కిరణ్, సత్యరాజ్, నిత్యా మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఇళయరాజా బయెపిక్ షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్.. త్వరలోనే లెజెండరీ నటుడు జోసెఫ్ పనిమయదాస్ చంద్రబాబు బయోపిక్ చేయనున్నట్లు సినీవర్గాల్లో టాక్ నడుస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ధనుష్ ఇటీవలే రాయన్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు.
ధనుష్ 2017లో వచ్చిన పవర్ పాండి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో నటీనటులు రాజ్ కిరణ్, రేవతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలైనప్పుడు ప్రజల నుండి మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత చాలా కాలం వరకు ధనుష్ సినిమాల దర్శకత్వంపై దృష్టి పెట్టలేదు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.