Actor: 52 ఏళ్లలోనూ కుర్ర హీరోలకు పోటీ.. 25 ఏళ్లుగా స్వీట్స్‌కు దూరం.. ఎవరో తెలుసా?

Actor: 52 ఏళ్లలోనూ కుర్ర హీరోలకు పోటీ.. 25 ఏళ్లుగా స్వీట్స్‌కు దూరం.. ఎవరో తెలుసా?


అతనికి బాలీవుడ్ లో కండల హీరోగా పేరుంది. అందుకు తగ్గట్టుగానే మంచి బాడీ ఫిజిక్ అతని సొంతం. కెరీర్ ప్రారంభంలో అతను అమ్మాయిల కలల రాకుమారుడు. బాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అతను ఈ మధ్యన పెద్దగా కనిపించడం లేదు. అలాగే హీరో పాత్రలు పక్కన పెట్టి విలన్ పాత్రల్లోనూ కనిపిస్తున్నాడు. అయితే అ హీరో క్రేజ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కారణం అతని బాడీ ఫిజిక్. 52 ఏళ్లలోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. అతను మరెవరో కాదు ధూమ్ హీరో జాన్ అబ్రహమ్. మంగళవారం (డిసెంబర్ 17) అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జాన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. కాగా జాన్ అబ్రహం ఫిట్‌నెస్‌కు పేరుగాంచాడు. ఏది మర్చిపోయినా జిమ్‌లో వర్కవుట్ చేయడం మర్చిపోడు. ప్రస్తుతం అతని వయసు 52 ఏళ్లు. ఈ వయసులోనూ ఎంతో ఫిట్‌నెస్‌ని మెయింటెయిన్‌ చేస్తున్నాడు. అన్నట్లు అతను స్వీట్లు తిని 25 ఏళ్లు అయింట. ఫిట్‌నెస్ కు, ఆరోగ్యానికి జాన్ ఇచ్చే ప్రాధాన్యత ఏంటో దీనిని బట్టే అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

జాన్ అబ్రహం హీరోగా బాగా సక్సెస్ అయ్యాడు. బాలీవుడ్‌లో విలన్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. పఠాన్ లో షారుఖ్ ఖాన్ కు విలన్ గా ఆకట్టుకున్నాడు. జాన్ హీరోగా నటించిన ‘వేద’ చిత్రం ఇటీవల విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. కాగా తన ఫిట్ నెస్ కు కారణమేంటని ఓ ఇంటర్వ్యూలో జాన్ ను అడగ్గా గత 25 ఏళ్లుగా స్వీట్లు తినకపోవడమే కారణమని చెప్పుకొచ్చాడు. స్వీట్లకు దూరంగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీర బరువు తగ్గుతుంది. పంచదార తినకపోతే మధుమేహానికి దూరంగా ఉండవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ లేదు అంటే గుండె సమస్యలు ఉండవు. పొట్ట ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జాన్ అబ్రహం లేటెస్ట్ ఫొటోస్..

జాన్ అబ్రహం నాన్ వెజ్ తింటాడని, అందుకే అతనికి అంత మంచి శరీరం ఉందని అందరూ అనుకోవచ్చు. కానీ, అది అబద్ధం. అతను పూర్తి శాకాహారి. అయితే క్రమం తప్పకుండా జిమ్ కు వెళతాడు. వర్కవుట్లు చేస్తాడు. ఇదే జాన్ ఫిజిక్ కు ప్రధాన కారణమట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *