ప్రస్తుత కాలంలో అన్ని రకాల ఆరోగ్య సమస్యలు అందరికీ కామన్‌గా వచ్చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందర్నీ ఎక్కువగా బాధిస్తున్న సమస్యల్లో అసిడిటీ కూడా ఒకటి.
అసిడిటీ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ మరింత పెరిగే అవకాశం ఉంది. కొంత మంది తెలియక తినేస్తూ ఉంటారు. కానీ ఈ ఆహారాల పట్ల జాగ్రత్త పాటించడం అవసరం.
గ్యాస్. అసిడిటీతో బాధ పడేవారు ఖచ్చితంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోకూడదు. అంటే నిమ్మ, నారింజ, టమాటా, ఆరెంజెస్ వంటివి తినకూడదు. ఇందులో పులుపు ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.
పాల పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. పన్నీర్, వెన్న, చీజ్, పాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే అసిడిటీ పెరిగే అవకాశం ఉంది. జంక్ ఫుడ్స్ కూడా అస్సలు తినకండి. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్‌లు, న్యూడుల్స్, బేకరీ ఫుడ్స్ తినకూడదు.
అసిడిటీ ఉన్నవారు సోడా, కూల్ డ్రింక్స్ జోలికి కూడా పోకూడదు. వీటిని అస్సలు దగ్గరకు రానివ్వకూడదు. ఇవి తాగితే అసిడిటీ మరింత పెరుగుతుంది. ఉల్లిపాయలను కూడా కాస్త తక్కువగానే తీసుకోవాలి. ఎక్కువగా తింటే అసిడిటీ పెరుగుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)