అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం. యాక్సిడెంట్ కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదు. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదు. నా స్నేహితుడు రేవంత్ రెడ్డికి ఇది తెలిసి జరిగిందో , తెలియకుండా జరిగిందో తెలియదు. ఏదేమైనా అల్లు అర్జున్ ను విడుదల చేయాలని అప్పీల్ చేస్తున్నా. ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డా దాఖలాలు లేవు. ఒకవేళ రిమాండ్ వేసినా ఈ రోజో, రేపో బెయిల్ వస్తుంది. ఇక శుక్రవారం అరెస్టు చేయడం అన్నది యాదృచ్చికమా? కావాలని జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది.నన్ను కూడా అలానే అరెస్టు చేసారు. ఒకవేళ ఘటనకు బాధ్యులను చేయాల్సి వస్తే బెనిఫిట్ షో కు అనుమతి ఇచ్చిన వాళ్ళను, టికెట్స్ పెంచుతూ అనుమతి ఇచ్చిన వాళ్లను కూడా అరెస్టు చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం బాధాకరం. దీనిపై సోషల్ మీడియాలో రాద్ధాంతం తగదు. ఎవరెవరో బన్నీకి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందంటున్నారు. ఇలాంటివి ప్రచారం చేయడం తగదు. ఇలా అరెస్టులు చేయడం వల్ల స్టార్ హీరోలు ప్రజల్లో రావడానికి బయపడతారు. తప్పు చేస్తే శిక్షించవచ్చు. అంతేకానీ.. ఒక యాక్సిడెంట్ జరిగితే ఒకరిని బాధ్యుడిని చేయడం సరికాదు.
ఇవి కూడా చదవండి
‘ఈ విషయంలో నేను సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగ విజ్ఞప్తి చేస్తున్నాను. అరెస్ట్ విషయంపై పునరాలోచంచుకోవాలి. తప్పుకుండా అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుంది. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. 1000 కోట్లు సాధించి సూపర్ డూపర్ హిట్ సాధించిన నీకు నరఘోష తగిలి ఉండవచ్చు. అందుకే ఇలా జరిగి ఉండవచ్చు’ అని వీడియోలో చెప్పుకొచ్చారు ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఏపీ డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ షేర్ చేసిన వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.