మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు దూకుడుగా ప్రవర్తించిన విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. ఈ పెనాల్టీతో పాటు డీమెరిట్ పాయింట్లో కోత విధించారు.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్‌మెన్ సామ్ కొన్‌స్టాస్‌ను విరాట్ కోహ్లి భుజంతో నెట్టడం తీవ్ర దూమారం లేపింది. దీంతో ఐసీసీ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ వివాదంపై కోహ్లీని ఐసీసీ వివరణ కోరగా కోహ్లీ తన తప్పును అంగీకరించడంతో ఐసీసీ జరిమానా విధించినట్లు సమాచారం.
విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20% జరిమానా, దురుసుగా ప్రవర్తించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు వస్తే ఆ ఆటగాడిపై ఒక టెస్టు లేదా రెండు వన్డేల నిషేధం విధిస్తారు. కాబట్టి మళ్లీ డీమెరిట్ పాయింట్లు రాకుండా కోహ్లీ జాగ్రత్తపడక తప్పదు.
గతంలో మహ్మద్ సిరాజ్‌కు ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. అడిలైడ్ టెస్టులో ట్రావిస్ హెడ్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు సిరాజ్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించారు. దీంతో మహ్మద్ సిరాజ్ బ్రిస్బేన్, మెల్ బోర్న్ టెస్టుల్లో ఆచితూచిగా వ్యవహరిస్తున్నాడు.