Andhra News: ఫాంహౌస్ నుంచి రాత్రి కాంట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు.. ఉదయాన్నే సేమ్ ప్లేస్‌లో షాకింగ్ సీన్..!

Andhra News: ఫాంహౌస్ నుంచి రాత్రి కాంట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు.. ఉదయాన్నే సేమ్ ప్లేస్‌లో షాకింగ్ సీన్..!


రాత్రి కిడ్నాప్.. ఉదయానికి శవమై కనిపించిన కాంట్రాక్టర్.. శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ కిడ్నాప్ అండ్ మర్డర్ సంచలనం రేకెత్తిస్తోంది. కొత్తచెరువు మండలం మైలేపల్లి గ్రామ సమీపాన విద్యుత్ కాంట్రాక్టర్ రాజశేఖర్ రెడ్డిని తన ఫామ్ హౌసులో నిద్రిస్తుండగా రాత్రి కొంతమంది దండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉదయం అదే ఫామ్ హౌస్ వద్ద కూలీలకు షాకింగ్ సీన్ కనిపించింది. రాత్రి కిడ్నాప్ అయిన రాజశేఖర్ రెడ్డి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు. నల్లమాడ మండలం బొగ్గులపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి ట్రాన్స్‌కో సంబంధించి విద్యుత్ కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే కొత్తచెరువు మండలం మైలేపల్లి గ్రామం దగ్గర ఉన్న తన ఫామ్ హౌస్‌లో కాంట్రాక్టర్ రాజశేఖర్ రెడ్డి నిద్రిస్తున్నాడు. ఫామ్ హౌస్ బయట తన దగ్గర పని చేసే కూలీలు కూడా అక్కడే నిద్రిస్తున్నారు.

అర్ధరాత్రి కొంతమంది దుండగులు వచ్చి కాంట్రాక్టర్ రాజశేఖర్ రెడ్డిని వాహనంలో ఎక్కించుకుని కిడ్నాప్ చేసినట్లు కూలీలు చెబుతున్నారు. ఒక్కసారిగా దుండగులు ఫామ్ హౌస్‌లో చొరబడడంతో.. భయపడిన కూలీలు పారిపోయి.. 100కి డయల్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, కూలీలు ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి.. బయట కాంట్రాక్టర్ రాజశేఖర్ రెడ్డి డెడ్ బాడీ కనిపించింది. ఒంటినిండా తీవ్ర గాయాలతో కనిపించిన రాజశేఖర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కిడ్నాప్ చేసిన దుండగులు.. హత్య చేసిన తర్వాత శవాన్ని ఫామ్‌హౌస్ వద్ద పడేసి వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటన స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు, రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న కూలీలతో మాట్లాడిన పోలీసులు.. అక్రమ సంబంధం కారణంగా కాంట్రాక్టర్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *