Watch: వేగంగా వెళ్తున్న కారు గ్లాస్‌పై గగ్గుర్పాటు కలిగించే దృశ్యం..! వైరల్‌ వీడియో చూస్తే ..

Watch: వేగంగా వెళ్తున్న కారు గ్లాస్‌పై గగ్గుర్పాటు కలిగించే దృశ్యం..! వైరల్‌ వీడియో చూస్తే ..


సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అలాంటి వీడియోలు పాములకు సంబంధించినవి కూడా అనేకం ఉన్నాయి. ఇంటి లోపలా, బయటా పాములు ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తాయో చెప్పడం కష్టం. చాలా సార్లు పాములు కారు, బైకు, చెప్పుల స్టాండ్‌, చివరకు షూలలో కూడా నక్కి ఉన్న వీడియోలు ఇంటర్‌నెట్‌లో మనం తరచూ చూస్తుంటాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు చర్చనీయాంశమైంది. కారులో ప్రయాణిస్తున్న కుటుంబానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. డ్రైవింగ్ చేస్తుండగా కారు సైడ్ వ్యూ మిర్రర్ పై వారికి షాకింగ్‌ సీన్‌ కనిపించింది. ఆ దశ్యానికి కారులో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.

వైరల్‌ వీడియోలో కారు ముందు అద్దంలోంచి పాము పాకుతున్నట్లుగా కనిపించింది. ఆ సమయంలో రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఒకరు వీడియోపై స్పందిస్తూ ఆ పామును సమీప అడవిలో వదిలేయండి అని రాశారు. మరొకరు వీడియోపై స్పందిస్తూ హమ్మయ్య పాము ప్రాణాలతో బయటపడిందని అన్నారు. పాము రోడ్డుపై పడితే వాహనం కిందపడి చనిపోయేదని అన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

పాములకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు సైతం ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఇటీవల అస్సాం యూనివర్సిటీ హాస్టల్ సమీపంలో ఒక భారీ కొండచిలువ కనిపించిన వీడియో వైరల్ అయ్యింది. పాము బరువు దాదాపు 100 కిలోలు ఉంటుందని తెలిపారు. దీంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *