Traffic Rules: మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా? రూల్స్‌ ఏంటి?

Traffic Rules: మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా? రూల్స్‌ ఏంటి?


భారతదేశంలో డ్రైవింగ్‌కు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. ఈ నిబంధనలు పాటించకుంటే మీ చలాన్ జారీ చేయడం ఖాయం. అయితే డ్రైవింగ్‌లో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటాం. చాలా మందికి అలాంటి నిబంధనలు తెలియకపోవడం వల్ల కూడా పొరపాట్లు జరగవచ్చు. మీరు అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే, మీకు ట్రాఫిక్ చలాన్ జారీ కావడం ఖాయం. ఈ విషయం కొందరికి తెలియకపోవచ్చు.

మోటారు వాహన చట్టం ప్రకారం చలాన్ జారీ:

అత్యవసర వాహనం కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ అంబులెన్స్‌కు దారి ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీనికి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ 194E సెక్షన్ కింద ట్రాఫిక్ చలాన్ జారీ చేయవచ్చు. మీరు మొదటి తప్పు చేస్తే, రహదారిపై అమర్చిన కెమెరాలో పరిశీలించి, లేదా ఎవరైనా వీడియో తీసినా మీకు రూ.10,000 చలాన్ జారీ అవుతుంది. ఇది మాత్రమే కాదు, మీరు ఈ తప్పును పునరావృతం చేస్తే, రూ.10,000 చలాన్ మీ నుంచి వసూలు చేస్తారు.

అంబులెన్స్‌కి దారి ఇవ్వడం ఎందుకు అవసరం?

అంబులెన్స్‌కు దారి ఇవ్వడం అవసరం ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో రోగి చనిపోవచ్చు. దారిలో అంబులెన్స్ కూడా కనిపిస్తే కచ్చితంగా దారి ఇవ్వాల్సిందే. మీరు అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే మీకు భారీ చలాన్ జారీ చేస్తారు. అందువల్ల, మీరు ఈ విషయంలో పూర్తి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, మీకు 6 నెలల జైలు శిక్ష కూడా పడవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మార్గంలో వెళుతున్నప్పుడు, మీరు అంబులెన్స్‌ను చూసినట్లయితే, పొరపాటున కూడా దారి ఇవ్వకుండా ప్రయత్నించవద్దు. లేకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *