RRR Movie: ఓటీటీలోకి రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

RRR Movie: ఓటీటీలోకి రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?


రాజమౌళి ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద వందలు, వేల కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టడం ఖాయం.  . అయితే జక్కన్న తొలిసారిగా ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. తన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ‘RRR: బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో జక్కన్న తీసిన డాక్యుమెంటరీ ఈ నెల 20 థియేటర్లలో విడుదలైంది. సుమారు 1 గంట 40 నిమిషాలు ఉన్న ఈ డాక్యుమెంటరీ మంచిగానే కలెక్షన్లు సాధించింది. ఈ డాక్యుమెంటరీ చిత్రం ‘RRR’ నిర్మాణాన్ని వివరిస్తుంది. సెట్ ఎలా ఉందో, సిబ్బందితో ఇంటర్వ్యూలు కూడా ఇందులో ఉన్నాయి. రామ్ చరణ్ పోలీస్ స్టేషన్ ఫైట్, టైగర్‌తో జూనియర్ ఎన్టీఆర్ ఫైట్, ఇంటర్వెల్‌లో ట్రక్కు నుండి జంతువులు దూకడం, నాటు నాటు సాంగ్ మేకింగ్ ఈ డాక్యుమెంటరీలో చూపించారు. jexe ఇప్పటికే యూట్యూబ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర  వీడియోలు వచ్చాయి. సినిమా వీఎఫ్‌ఎక్స్‌ ఎలా చేశారో, సినిమా కాస్ట్యూమ్స్‌, యాక్షన్‌ సన్నివేశాల వీడియోలు ఉన్నాయి. అయితే ఈ డాక్యుమెంటరీలో అసలు నేపథ్యం, ​​సాంకేతికత తదితర అంశాల గురించి చిత్రబృందం స్వయంగా వివరించింది. అలాగే ఆస్కార్‌కు వెళ్లిన అనుభవం, అక్కడ జరిగిన సంఘటనలు, ఆస్కార్ ప్రచారం తదితర అనేక అంశాలను ఈ డాక్యుమెంటరీలో చూపించారు.

ఇవి కూడా చదవండి

ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 1300 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక దీనిపై వచ్చిన డాక్యుమెంటరీ కూడా మంచి కలెక్షన్లనే సాధించింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై సుమారు 3 సంవత్సరాలు గడిచాయి. దీంతో మరోసారి ఈ బ్లాక్ బస్టర్ సినిమాను ఆడియెన్స్ కు చూపించారు జక్కన్న. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ డాక్యుమెంటరీ ఓటీటీలోనూ రిలీజ్ అయితే భారీ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో లో ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది.

మరో 3 రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

ఇక రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పనులతో ఆయన బిజీగా ఉంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *