ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో విచారణకు హాజరయ్యాడు. చిక్కడపల్లి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు? ఏయే అంశాలపై స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారన్న ఉత్కంఠ మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో పుష్ప-2 నుంచి సాంగ్ రిలీజ్ అయింది. పుష్ప-2 మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సాధిస్తూ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 1500కోట్లు రాబట్టింది. ఒక్క హిందీలోనే 700ల కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ జోష్ మరింత రెట్టింపు చేస్తూ దమ్ముంటే పట్టుకోరా సాంగ్‌ను రిలీజ్ చేసింది పుష్ప టీమ్. పుష్ప-2లో ఫహద్ ఫాజిల్ పోషించిన సాలిడ్ రోల్ భన్వర్ సింగ్ షెకావత్‌కి ఛాలెంజ్ విసురుతూ.. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని హీరో మాస్ డైలాగ్ ఉంటుంది. నిజానికి సినిమా చూసిన వాళ్లంతా ఈ డైలాగ్‌ను సాంగ్ రూపంలో వదలాలని కోరుతున్నారు. దీంతో ఈ ట్రాక్‌ని పాన్ ఇండియా భాషల్లో అఫీషియల్‌గా రిలీజ్ చేశారు మేకర్స్.
యూట్యూబ్‌లో సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌లతో దూసుకుపోతుంది. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో ఫహద్ ఫాజల్, జగపతిబాబు, సునీల్, అనసూయ కీ రోల్ పోషించారు.