GST Council: జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?

GST Council: జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?


ఈనెల 21న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏకాభిప్రాయంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై జీఎస్టీ రేట్లు పెంచగా, కొన్ని అంశాలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా పడింది. మరి ఏ వస్తువులు చౌకగా, ఏవి ఖరీదైనవిగా మారాయో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!

  1. ఉపయోగించిన వాహనాలతో పాటు EVలపై జీఎస్టీ: సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్టీ పెంచారు. 12 శాతం నుండి 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది అందరికి కాదు. కేవలం కంపెనీలనుపై మాత్రమే ప్రభావితం చేస్తుంది. అంటే వ్యక్తిగతంగా కార్లను అమ్మినట్లయితే ఈ జీఎస్టీ పెంపు వర్తించదు. వ్యాపార కంపెనీలు విక్రయించినట్లయితే ఈ జీఎస్టీ పెంపు వర్తిస్తుందని గుర్తించుకోవాలి. ఇందులో EVలు కూడా ఉన్నాయి. అయితే, సాధారణ పౌరుడు ఉపయోగించిన వాహనాలను కొనుగోలు చేసి విక్రయిస్తే, జీఎస్టీ రేటు 12% మాత్రమే.
  2. బీమా, ఆహార ఆర్డర్‌లు: ఆరోగ్య బీమా, జీవిత బీమాపై GST రేటును తగ్గించడం లేదా తీసివేయడం కూడా వాయిదా వేసింది కౌన్సిల్‌. దీనితో పాటు, Zomato, Swiggy వంటి ప్రదేశాల నుంచి ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయడంపై GST రేటును తగ్గించే ప్రతిపాదన కూడా వాయిదా పడింది.
  3. ఇవి కూడా చదవండి

  4. పాప్‌కార్న్‌పై జీఎస్‌టి రేట్లు: కౌన్సిల్ పాప్‌కార్న్‌పై మూడు రకాల జిఎస్‌టి రేట్లను ప్రతిపాదించింది. అంటే 3 రకాల పన్నులు విధించవచ్చు. ముందుగా ఉప్పు, మసాలాలు కలిపి రెడీమేడ్ పాప్ కార్న్ పై 5% జీఎస్టీ విధించాలని సూచించింది. ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేసిన పాప్‌కార్న్‌పై 12 శాతం జీఎస్టీ, కారామెల్ పాప్‌కార్న్‌పై 18 శాతం పన్ను వర్తిస్తుంది.
  5. హోటళ్లు, రెస్టారెంట్లపై వర్తించే 18 శాతం జీఎస్టీలో మార్పు లేదు. ఇందులో 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలనే ప్రతిపాదన వచ్చింది. ఒక రాత్రికి రూ.7500 కంటే ఎక్కువ ఖర్చుతో గదులు ఉన్న హోటళ్లకు ఉపశమనం కల్పించాలని ప్రతిపాదన చేశారు.
  6. రూ.5 లక్షల వరకు కవరేజీ ఉన్న ఆరోగ్య బీమా కోసం సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని సూచించింది.

ఏది చౌకగా మారుతుంది?

  1. అనేక వస్తువులు, సేవలు GST రేట్లలో తగ్గింపు ఉన్నాయి. వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తాయి.
  2. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (FRK): ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసినప్పుడు ఫోర్టిఫైడ్ బియ్యం గింజలపై GST రేటు 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది జీఎస్టీ కౌన్సిల్‌.
  3. జన్యు చికిత్స: మెడికల్ ట్రీట్‌మెంట్‌లలో పురోగతిని ప్రోత్సహించడానికి, దానిని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, జన్యు చికిత్స జీఎస్టీ నుండి మినహాయించింది.
  4. ఉచిత పంపిణీకి ఆహార తయారీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ కార్యక్రమాల కింద సరఫరా చేసే ఆహార పదార్థాలకు 5 శాతం రాయితీ నిర్ణయించింది.
  5. లాంగ్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ అసెంబ్లీ (LRSAM): సిస్టమ్స్, సబ్-సిస్టమ్‌లు, LRSAM తయారీకి ఉపయోగించే సాధనాలు ఐజీఎస్టీ నుండి మినహాయింపు ఇచ్చింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా తనిఖీ కోసం పరికరాలు, వినియోగ వస్తువుల దిగుమతులు కూడా IGST నుండి మినహాయింపు ఇచ్చింది.
  6. మిరియాలు, ఎండుద్రాక్ష విక్రయాలు: వ్యవసాయదారులు నేరుగా విక్రయించే మిరియాలు, ఎండుద్రాక్షలు GSTకి బాధ్యత వహించవని స్పష్టం చేసింది. ఇది రైతులకు ఉపశమనం కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: Isha Ambanis: అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *