అరె.! ఏంట్రా ఇది.. మగ టీచర్‌కు ప్రసూతి సెలవులు.. నవ్వుకుంటున్న జనాలు..

అరె.! ఏంట్రా ఇది.. మగ టీచర్‌కు ప్రసూతి సెలవులు.. నవ్వుకుంటున్న జనాలు..


ఎక్కడైనా, ఎప్పుడైనా మగవారు గర్భం దాల్చినట్లు మీరు చూశారా..? లేదంటే విన్నారా..? ఏంటీ షాక్ అయ్యారా.. మీరు సరిగానే చదివారు..బీహార్ విద్యాశాఖ ఓ మగ టీచర్‌ను గర్భవతిని చేసింది. నిజానికి టీచర్ గర్భవతి కాదు. అయితే, అక్కడి విద్యా శాఖ నిర్లక్ష్యం కారణంగా అతడు ప్రసూతి సెలవుపై వెళ్లాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బీహార్ విద్యాశాఖ, ఉపాధ్యాయులు ఎగతాళి చేస్తున్నారు. అయితే ఆ అధికారి తన తప్పును అంగీకరించాడు.

ఈ వింత కేసు వైశాలి జిల్లాలోని హాజీపూర్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ, మహువా బ్లాక్ ఏరియాలోని హసన్‌పూర్ ఒసాటి హైస్కూల్‌లో ఒక BPSC ఉపాధ్యాయుడు పోస్ట్ విధులు నిర్వహిస్తున్నాడు. అతని పేరు జితేంద్ర కుమార్ సింగ్. విద్యాశాఖ అతన్ని గర్భవతిని చేసి డిశ్చార్జి చేసింది. ఈ ప్రసూతి సెలవులు విద్యా శాఖ ఇ-శిక్షా కోష్ పోర్టల్‌లో ఇవ్వబడ్డాయి. ఈ సెలవును అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. విద్యాశాఖ, అధికారిక వెబ్‌సైట్ దృష్టిలో ఉపాధ్యాయుడు జితేంద్ర గర్భవతి అని అతడు సెలవులో ఉన్నట్టు లెక్క. మహిళలకు ఇచ్చిన సెలవుల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కూడా విద్యాశాఖ సెలవు ఇచ్చిన తీరుపై ఇతర ఉపాధ్యాయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ పాఠశాలలోని పురుష ఉపాధ్యాయుడికి ప్రసూతి సెలవులు ఇచ్చే విషయంలో బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అర్చన కుమారి మాట్లాడుతూ – హసన్‌పూర్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న జితేంద్ర కుమార్ అనే ఉపాధ్యాయుడికి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 10 వరకు ప్రసూతి సెలవు ఇచ్చారని చెప్పారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ అవకతవకలు జరిగాయని అన్నారు. మెయిల్ టీచర్‌కు ఈ పద్ధతిలో సెలవు ఇవ్వరని, త్వరలోనే దీనిని సరిచేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ తప్పిదానికి విద్యాశాఖ అధికారి విచారం వ్యక్తం చేస్తూ.. ఈ తప్పును శాఖ వెంటనే సరిదిద్దుతుందని చెప్పారు. అయితే ఈ ఘటన విద్యాశాఖకే పరువునష్టం తెచ్చిపెట్టడంతో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్‌లో ఆ శాఖ నిమగ్నమైంది.

మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్ విద్యా శాఖ చేసిన ఈ తప్పిదంతో ఇంటర్నెట్‌లోని వినియోగదారులు తెగ నవ్వుకుంటున్నారు. ఈ పోస్ట్‌ప ఒకరు స్పందిస్తూ… అమేజింగ్ బీహార్ అంటూ వ్యాఖ్యనించారు. ఇలా కూడా జరుగుతుందా ..? అంటూ మరొక వినియోగదారు రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *