Viral: మరీ ఇంత వైల్డ్ ఉన్నావేంటి అక్కో.! ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని..

Viral: మరీ ఇంత వైల్డ్ ఉన్నావేంటి అక్కో.! ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని..


సాధారణంగా ఒకప్పుడు ప్రేమకు, రిలేషన్‌షిప్‌కు అర్ధం వేరేలా ఉండేది. ఒకప్పుడు ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారంటే.. వారిద్దరూ ఒకరికొకరు లాయల్‌గా ఉంటూ.. ఒకరంటే ఒకరు ప్రాంతంగా ఉండేవారు. అది జెన్యూన్ రిలేషన్‌షిప్ అండ్ లవ్ అని అంటారు. కానీ ఇప్పుడు జెన్-జీ జెనరేషన్‌లో రిలేషన్‌లో ప్రేమ, రిలేషన్‌కి వేరే అర్ధాలు వచ్చేశాయి. ఇప్పుడు రిలేషన్ పేరుతో ఒకరితో ఉంటూనే మరొకరితో ట్రాక్ నడిపేస్తున్నారు. ఒకేసారి ఇద్దరు, ముగ్గురితో ఫిజికల్ రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ తరహాలో తనను మోసం చేసిన ఓ యువకుడితో విసిగిపోయిన ఒక యువతి.. ఏకంగా అతడిపై పగ తీర్చుకుంది. ఎలా తీర్చుకుందో తెలిస్తే.. మీరు షాక్ కావడం ఖాయం. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చదవండి: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని సుమారు 8 సంవత్సరాలుగా ప్రేమించింది సదరు యువతి. అయితే అతడు తనను మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రియురాలు అతడితో మాట్లాడదామని పిలిచి కారులో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లింది. అక్కడ కారులోనే గంటల తరబడి మాట్లాడుతూ హఠాత్తుగా తనతో తీసుకొచ్చిన కత్తిని తీసి ప్రియుడి జననాంగాలను కోసేసింది. అదే కత్తితో ఆమె చేతిని కూడా కోసుకుంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. సదరు 21 ఏళ్ల యువతిని డిసెంబర్ 22న ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అటు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మీరూ దానిపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

ఇది చదవండి: ఇదేం లొల్లిరా.. శోభనం రాత్రి వధువు వింత కోరికలు.. దెబ్బకు బిత్తరపోయిన వరుడు





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *