అల్లు అర్జున్ పోలీసులు ముందు హాజరయ్యారు. నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు పంపారు పోలీసులు. సంద్యథియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసిన చేశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సందడి చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దాంతో అల్లు అర్జున్ బౌన్సర్లు జనాలను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను ఏ 11గా చేర్చారు.
డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆతర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా మరోసారి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసుకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలు పోలీసులు సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన గురించి అల్లు అర్జున్ ను ప్రశ్నించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి