ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలంలో ఇవి తెగ ట్రెండింగ్ అవుతున్నాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ప్రతీ చోటా ఇవే కనిపిస్తున్నాయి. రకరకాల ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, చిత్రవిచిత్రమైన ఫోటో పజిల్స్ నెటిజన్లకు సవాల్ విసురుతున్నాయి. అలాగే చాలా మంది వీటిని ఆడుతూ.. కాసేపు రిలాక్స్ అవుతుంటారు. ఈ పజిల్స్‌లో మన కళ్లముందే ఆన్సర్ ఉన్నప్పటికీ.. దాన్ని కనిపెట్టలేం. ఒకవేళ మీరే తెలివైనవారైతే.. ఈ ఫోటో పజిల్స్‌ను 10 నుంచి 15 సెకన్లలో సాల్వ్ చేయండి మరి.
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? కొంచెం తీక్షణంగా చూడండి. అందులో ఓ నెంబర్ దాగుంది అది మీరు కనిపెట్టాలి. అదే టాస్క్. ఇక వీడేంటి..? ‘0’ సిరీస్‌ను పట్టుకుని నెంబర్ కనిపెట్టమంటున్నాడు అని అనుకోవద్దు. అక్కడున్నది లెటర్ ‘O’.. ఇక వాటి మధ్య నెంబర్ ‘0’ ఉంది. అర్ధమైంది కదూ.! లేట్ ఎందుకు మరో ఈ టాస్క్ కేవలం 10 సెకన్లలో సాల్వ్ చేయండి చూద్దాం. ఇక అనుకున్న టైంలోపు మీరు ఆన్సర్ కనిపెడితే.. మీరే తోపులు.. ఒకవేళ కనిపెట్టకపోయినా.. ఏం పర్లేదు.. సమాధానం కింద ఇచ్చేస్తున్నాం. ఈసారి లైట్ తీసుకోండి. వచ్చేసారి మాత్రం ఠక్కున మీ ఐ ఫోకస్ రేంజ్ పెంచుకునేందుకు ప్రయత్నించండి.
సమాధానం..
ఫోటోలో ఉన్నవి అన్ని సున్నాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అవన్నీ ‘O’ లెటర్స్.. ఇక అందులో జీరో(0) నెంబర్ కూడా ఉంది. అదే మ్యాజిక్. ఇక ఆ జీరో నెంబర్ సెకండ్ వరుసలో లాస్ట్ నుంచి రెండోది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి