కనిపిస్తున్నది రష్మిక మందన్న అయినా.. వినిపిస్తున్నది మాత్రం విజయ్ దేవరకొండ. గాళ్ ఫ్రెండ్ సినిమాలో తన లక్కీ హీరోయిన్ కోసం ఆయన స్వరదానం చేసారు. టీజర్ అంతా విజయ్ వాయిస్ ఓవర్‌తోనే కవర్ చేసారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.
అలాగే బాలయ్య డాకూ మహరాజ్ కోసం రవితేజ రంగంలోకి దిగుతున్నారు. దర్శకుడు బాబీతో రవితేజకు ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఆయన తెరకెక్కించిన వాల్తేరు వీరయ్యలో సపోర్టింగ్ రోల్ కూడా చేసారు మాస్ రాజా. ఇప్పుడు బాలయ్య కోసం వాయిస్ ఇస్తున్నారు.
ఈ ఏడాది మొదట్లో హనుమాన్ సినిమాలో కోతికి కూడా రవితేజ వాయిస్ ఇచ్చారు. ఆ సినిమాకు అది బాగా హెల్ప్ అయింది కూడా. హనుమాన్ చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అయినా సంగతి తెలిసిందే.
హాలీవుడ్ విజువల్ వండర్ ముఫాసా: ది లయన్ కింగ్ కోసం మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల అయింది. ముఫాసా తెలుగు వర్షన్‌కు మహేష్ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్. అలాగే సత్యదేవ్, అలీ, బ్రహ్మానందం లాంటి వాళ్లు కూడా ఈ సినిమాకు వాయిస్ ఇచ్చారు.
అప్పట్లో పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిన సైరా నరసింహ రెడ్డి సినిమాకు పవర్ స్టార్ కూడా వాయిస్ ఇచ్చారు.