Cyber Crime: సైబర్ క్రైమ్ ఆఫీసర్లమని ఫోన్.. కట్ చేస్తే.. 11 కోట్లు గాయా

Cyber Crime: సైబర్ క్రైమ్ ఆఫీసర్లమని ఫోన్.. కట్ చేస్తే.. 11 కోట్లు గాయా


ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ( సైబర్ క్రైమ్ )గా చెప్పుకుంటున్న కొందరు సైబర్ మోసగాళ్లు బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రూ.11 కోట్లు దండుకున్నారు. బెంగళూరులో విజయ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.  అయితే ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులమని  వినయ్ కుమార్‌కు కొందరు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. “మీపై ముంబైలోని కొలాబాలో కేసు నమోదైంది. మీ ఆధార్ కార్డును ఉపయోగించి రూ.6 కోట్లు బదిలీ జరిగింది. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది” అని వారు ఫోన్ చేసి చెప్పారు.

తరువాత మోసగాళ్ళు వీడియో కాల్ చేసి, వినయ్ కుమార్‌ను డిజిటల్‌గా ఒక నెల పాటు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు . నెల రోజులు ఇంట్లో ఉండకూడదని చెప్పడంతో విజయ్ కుమార్ యలహంకలోని ఓ లాడ్జిలో ఉన్నాడు. విజయ్ కుమార్ గత కొన్నేళ్లుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. దీన్నే లక్ష్యంగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు వినయ్ కుమార్ నుంచి షేర్లను విక్రయించారు. తరువాత వినయ్ కుమార్ నుండి రూ.11 కోట్లు నగదు బదిలీ చేయించుకున్నారు.సైబర్ నేరగాళ్లు మొదట ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్పుకున్నారు. అనంతరం ఈడీ, ఐటీ అధికారులమని చెప్పి మోసానికి పాల్పడ్డారు. బెంగళూరు ఈశాన్య డివిజన్‌లోని సేన్‌ స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది.

డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?

డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ మోసం.. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ తదితర సంస్థల అధికారుల పేరుతో ప్రజలకు ఫోన్ చేసి, తప్పుడు కేసులు పెట్టి, బెదిరించి, ఆపై డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌తో సహా అనేక మార్గాల ద్వారా వారి నుండి డబ్బును దోపిడీ చేస్తారు. మోసగాళ్లు బాధితుల నుంచి లక్షలు, కోట్లలో డబ్బులు దండుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *