మీడియాపై దాడి, హత్యాయత్నం కేసులో నటుడు మోహన్‌బాబుకు చుక్కెదురైంది. మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై ధర్మాసనం సోమవారం విచారించింది. మోహన్‌బాబు ఇండియాలోనే ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారు.. తన మనవరాలిని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్‌లో మోహన్ బాబు పేర్కొన్నారు.
మోహన్‌బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరుపు లాయర్ వాదనలు వినిపించారు.. కాగా.. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ.. మోహన్‌బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని కోరారు. కాగా.. మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్ట్ రంజిత్ స్టేట్‌మెంట్‌ను జీపీ కోర్టుకు సమర్పించారు.. వాదనల అనంతరం బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
కాగా.. జల్‌పల్లిలో మీడియాపై దాడి, హత్యాయత్నం కేసులో మోహన్‌బాబు ఇప్పటికింకా ఎంక్వయిరీ ఫ్రేమ్‌లోకి రాలేదు. డిసెంబర్ 24వ తేదీ వరకు ఆయనకు టైముంది. ఆలోపు విచారణ జరపడానికి కోర్టు అనుమతి కోరుతామని ఇప్పటికే రాచకొండ పోలీసులు ప్రకటించారు.. ఈ క్రమంలోనే హైకోర్టు బెయిల్ పిటీషన్ ను కొట్టివేయడంతో మోహన్ బాబు బుధవారం పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.
లైవ్ వీడియో చూడండి..
ఇదిలాఉంటే.. ఇటీవల తన సిబ్బంది ద్వారా చంద్రగిరిలో ఒక గన్ సరెండర్ చేశారు మోహన్‌బాబు. మరి రెండో గన్ ఎక్కడ? క్లారిటీ ఇవ్వాలని నోటీస్ ఇచ్చారు పోలీసులు. మరోవైపు జల్‌పల్లిలో తరహాలో రంగంపేటలో మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి కేసులోనూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
మోహన్‌బాబు, మనోజ్ వివాదంలో ఇప్పటికే పోలీసులు 3 FIRలు నమోదు చేశారు.. మోహన్‌బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని.. ఈ నెల 24 వరకు మోహన్‌బాబు కోర్టును సమయం అడిగారని.. ఆ తర్వాత విచారణ ఉంటుందని ఇటీవల రాచకొండ సీపీ సుధీర్‌బాబు ప్రకటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి