Ayoidhya: బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం తేదీ, ఉత్సవాల నిర్వహణ షెడ్యుల్ మీ కోసం..

Ayoidhya: బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం తేదీ, ఉత్సవాల నిర్వహణ షెడ్యుల్ మీ కోసం..


అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రామనగరిని పెళ్లికూతురులా అలంకరించనున్నారు. మొదటి వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని జరపనున్న ఉత్సవాల సమాచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ ప్రాంత ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ అందించారు. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో బాల రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం జరపనున్నామని ఆయన చెప్పారు.

2024 జనవరి 22న పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిధి రోజున బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని ఆయన చెప్పారు. ఈ నెపధ్యంలో ఈ ఏడాది 2025 జనవరి నెలలో జనవరి 11న పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిధి వచ్చింది. కనుక హిందూ పంచాంగం ప్రకారం ఈ తిధిని ‘ప్రతిష్ఠ ద్వాదశి’ గా పిలుస్తున్నారు. ఈ సందర్భంగా జనవరి 11 నుంచి మూడు రోజుల పాటు నాలుగు చోట్ల వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆలయ సముదాయంలోని యాగ మండపంలో జరిగే కార్యక్రమాలు.

శుక్ల యజుర్వేద మధ్యదాని శాఖలోని 40 అధ్యాయాల 1975 మంత్రాలు అగ్నిదేవునికి సమర్పించబడతాయి. 11 వేద మంత్రాలను పఠిస్తారు. ఈ పూజాది కార్యక్రమాలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే సమయంలో శ్రీరామ మంత్రాన్ని పఠించే యాగం కూడా రెండు సెషన్లలో జరుగుతుంది. 6 లక్షల మంత్రాలు జపించనున్నారు. అంతే కాదు రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, పురుష సూక్త, శ్రీ సూక్త, ఆదిత్య హృదయ స్తోత్రం, అథర్వశీర్ష తదితర పారాయణాలు కూడా నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగే కార్యక్రమాలు

ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు దక్షిణం వైపున ఉన్న ప్రార్థనా మందిరంలో బాల రామయ్యకు రాగసేవ సమర్పిస్తారు. అంతే కాదు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో బాల రామయ్య సన్నిధిలో అభినందన గీతాలను కీర్తించనున్నారు.

సంగీత మానస విభావరి

ప్రయాణీకుల సౌకర్యాల కేంద్రం మొదటి అంతస్తులో మూడు రోజుల సంగీత మానస విభావరి కార్యక్రమం ఇక్కడ నిర్వహించనున్నారు.

అంగద్ తిలా మైదానం

అగంద్ తిలా మైదానంలో మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు రామ్ కథ, 3:30 నుంచి 5:00 గంటల వరకు రామ చరిత మానస్ గురించి ప్రవచనం చేయనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అన్నప్రసాద వితరణ

జనవరి 11వ తేదీ ఉదయం నుంచి స్వామివారి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. అంగద్ తిల మైదానం లో నిర్వహించనున్న అన్ని కార్యక్రమాలకు అన్ని సంఘాలను ఆహ్వానిస్తున్నారు.

మొదటి వార్షికోత్సవం లో జరుగు వేడుకలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ వేడుకలకు ఎలాంటి భద్రతాపరమైన ఆటంకాలు ఉండవని, భక్తులు ఎలాంటి ఆంక్షలు లేకుండా బాల రామయ్య వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన వచ్చు అన్ని.. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆస్వాదించవచ్చని చంపత్ రాయ్ చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *