Team India: 2024లో లేడీ కోహ్లీ తగ్గేదేలే.. ప్రపంచ రికార్డుతో మూడోసారి అరుదైన ఫీట్.. అదేంటంటే?

Team India: 2024లో లేడీ కోహ్లీ తగ్గేదేలే.. ప్రపంచ రికార్డుతో మూడోసారి అరుదైన ఫీట్.. అదేంటంటే?


Smriti Mandhana Records: స్మృతి మంధాన ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి ODIలో 91 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా ఐదవ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ కావడం గమనార్హం. ఈ కాలంలో ఆమె స్కోర్లు- 91, 77, 62, 54, 105లుగా నిలిచాయి. స్మృతి మంధాన తన ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో 2024లో 600కు పైగా వన్డే పరుగులు పూర్తి చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడోసారి 600కు పైగా పరుగులు చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో 600పైగా పరుగులు కూడా చేసింది. 2018లో కూడా రెండు ఫార్మాట్లలో ఇలా చేయడం గమనార్హం.

స్మృతి మంధాన 2024లో అంతర్జాతీయంగా 1602 పరుగులు చేసింది. దీని ద్వారా మహిళల క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు సృష్టించింది. 2024లోనే 1593 పరుగులు చేసిన దక్షిణాఫ్రికాకు చెందిన లారా వూల్‌వర్త్ రికార్డును బద్దలు కొట్టింది.

స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో 50 ప్లస్ 71 సార్లు స్కోర్ చేసింది. అలాగే, ఇతర ఎడమచేతి వాటం కలిగిన భారతీయ క్రికెటర్లందరూ అంతర్జాతీయ క్రికెట్‌లో 78 సార్లు యాభై ప్లస్ స్కోర్లు సాధించారు.

ఇవి కూడా చదవండి

మహిళల క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 జాబితాలో స్మృతి మంధాన పేరు మూడుసార్లు కనిపిస్తుంది. అంతకుముందు 2018లో 1291 పరుగులు, 2022లో 1290 పరుగులు చేసింది.

స్మృతి మంధాన మహిళల వన్డేలో తొంభైలలో ఆరోసారి ఔట్ అయింది. ఈ విషయంలో ఆమె ఆస్ట్రేలియాకు చెందిన అలిస్ పెర్రీని సమం చేసింది. భారతీయుల్లో మంధాన తర్వాత ఇలా ఐదుసార్లు చేసిన లిస్టులో మిథాలీ రాజ్ ఉంది. 2024లో భారత్ తరపున స్మృతి మంధాన అత్యధికంగా 1602 పరుగులు చేసింది. ఆమెకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీని ద్వారా ఆమె ఈ సంఖ్యను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు. 868 పరుగులు చేసిన షెఫాలీ వర్మ పేరు భారతీయుల్లో తర్వాతి స్థానంలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *