హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు కీలక సమావేశం నిర్వహించారు. సంధ్య థియేటర్ ఘటన.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ల ధరల పెంపుపై చర్చించారు. అనంతరం విరాళాలు సేకరించి బాలుడు శ్రీతేజ్ కు అందివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. సమావేశానికి ముందు నిర్మాత నాగవంశీ కీలకవ్యాఖ్యలు చేశారు. .
నాగవంశీ మాట్లాడుతూ.. “- ఎమోషనల్‌గా ఏమైనా జరిగితే ఎవరం ఏమీ ఆపలేం. జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఏ థియేటర్లో ఏం జరుగుతుందో ఫాలో అప్ చేయగలుగుతాం అని చెప్పలేం. – మన చేతుల్లో ఏదీ ఉండదు. కానీ, అలాంటివి జరగకుండా టేక్ కేర్ చేస్తాం. మొన్న జరిగింది దురదృష్టకరమైన విషయం. – అనుకోకుండా జరిగింది… ఇకపై అలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకుంటాం. థియేటర్లకు హీరోలు వెళ్లాలా? వద్దా? అనేది వాళ్లే నిర్ణయం తీసుకోవాలి” అని అన్నారు.
“సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు. తెల్లవారుజామున నాలుగు నుంచి సినిమా పడితే చాలు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చాక.. ముందు ఆయన సినిమా ఉంది… ఏం తేలుస్తారో చూద్దాం. సీఎం రేవంత్‌గారు చెప్పేశారు… అందరితో పాటూ నేనూ విన్నాను. కానీ, ఆ విషయం గురించి దిల్‌రాజుగారు హైదరాబాద్ వచ్చాక అందరూ కలిసి డిసైడ్ చేసి మాట్లాడుతాం. చంద్రబాబుగారిని, పవన్‌గారిని కలుద్దామని నాతో అయితే ఎవరూ చెప్పలేదు” అని అన్నారు.
ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ…. “నేను డబ్బు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నా.. నేను ఏపీకి వెళ్లి ఏం చేస్తాను? పవన్‌గారు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తామని మాతో ఫస్ట్ మీటింగ్‌లోనే చెప్పారు. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని ఆశిస్తున్నాం” అని ఆన్సర్ చేశారు నాగవంశీ.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.