ఎన్ని సినిమాలు చేసినా.. చాలామంది హీరోయిన్లకు స్టార్ స్టేటస్ అంత తొందరగా రాదు. ఆ హిట్ ఇచ్చే సినిమా పడితేనే గానీ.. ఆమె ఓవర్‌నైట్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ కొందరికి ఆ ఒక్క హిట్టు చిత్రం పడినా.. అదృష్టం కలిసిరాదు. ఆ కోవకు చెందిన భామ.. ఈ అమ్మడు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏడాది అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. అయితేనేం ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసిరాలేదు. మరే సినిమా అవకాశాలు ఇంకా తలుపు తట్టలేదు. మరి ఇంతకీ ఆ అప్సరస మరెవరో కాదు సంగీర్తన విపిన్.
కేరళకు చెందిన ఈ కుట్టి.. గతేడాది ‘నరకాసుర’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించినస్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో తమిళంలో ‘హిగుటా’, ‘కదువెట్టి’ అనే రెండు చిత్రాల్లో నటించింది. ఇవి కూడా సంగీర్తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అలాగే ఈ ఏడాది తెలుగులో చేసిన ‘ఆపరేషన్ రావన్’ చిత్రం కూడా ఫెయిల్ అయింది. అయితేనేం ఆ తర్వాత తెలుగులో సుహాస్ సరసన ‘జనక అయితే గనక’ అనే సినిమా సంగీర్తనకు హిట్ ఇవ్వడమే కాదు.. ఓవర్‌నైట్‌లోనే స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడటమే కాదు.. వరుసగా అవకాశాలు వచ్చిపెడతాయని అందరూ అనుకున్నారు. కానీ అమ్మడికి హిట్ దక్కినా అదృష్టం కలిసిరాలేదు. మరే ఆఫర్స్ తలుపు తట్టలేదు. కాగా, సోషల్ మీడియాలో ఈ అప్సరస ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
ఇది చదవండి:అబ్బబ్బో అరాచకం.. బోల్డ్ సిరీస్‌తో కవ్వించిన ఈ టాలీవుడ్ భామ ఎవరో తెల్సా