అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ ఆలయం తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని స్వామివారికి చెన్నైకి చెందిన భక్తులు బంగారు కిరీటాన్ని విరాళంగా అందించారు. వసంత లక్ష్మి, ఆమె కుమార్తె శ్రీమతి మాధవి, అల్లుడు శ్రీ మనోహర్ లు 341 గ్రాముల బంగారు కిరీటాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా సమర్పించారు. ఈ కిరీటం విలువ సుమారు రూ.27 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. స్వామివారి దర్శనాంతరం దాతలకు పండితులు వేదశీర్వచనం చేశారు.
ఆలయ సూపరింటెండెంట్ ముని బాల కుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ డి కృష్ణమూర్తి, అసిస్టెంట్ నాగరాజు, ఆలయ అర్చకులు గోపాల భట్టార్, కృష్ణ ప్రసాద్ భట్టార్, గోకుల్, అనిల్ కుమార్ దాతల నుంచి ఈ బంగారు కిరీటాన్ని స్వీకరించారు.
ఆలయ చరిత్ర
రాయలసీమలో కాణిపాక వినాయక ఆలయం తర్వాత ప్రమాణాలకు ప్రసిద్ది చెందిన ఆలయం తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం. ఈ ఆలయంలోని లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని ధుర్వస మహర్షి ప్రతిష్టించాడని పురాణాల కథనం. తన శక్తులను ఉపయోగించి ఇక్కడ ధర్మ పీఠాన్ని కూడా స్థాపించాడు. అందుకనే ఇక్కడ చేసే సత్య ప్రమాణాలకు అత్యంత విలువ ఉంటుంది. ఎవరైనా సరే ఆలయంలో నిద్ర చేస్తే.. అది వారి కుటుంబంతో పాటు వారి వంశంలోని తరతరాలను ప్రభావితం చేస్తుందని భక్తుల నమ్మకం. తరిగొండ పేరు ప్రఖ్యాతిగాంచిన ఈ గ్రామం.. తిరుమల క్షేత్రంలో వెలసిన వేంకటేశ్వర స్వామిపై రచనలు చేసిన విప్లవ సాధువు, కవయిత్రి తరిగొండ వెంగమాంబ జన్మించిన స్థలం.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..