తాజాగా ఆస్పత్రిలోని టాయిలెట్ కమోడ్‌లో ఏదో అడ్డం పడిందని సిబ్బంది చెప్పడంతో పారిశుధ్య కార్మికులు యంత్రాలతో శుభ్రం చేశారు. ఈ సమయంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం బయటకు వచ్చింది. దీంతో విచారణ చేపట్టగా గుట్టు రట్టయింది. అమృత, సురేంద్రలు సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ, సహ జీవనం సాగిస్తున్నారు. అమృత గర్భం దాల్చగా కడుపునొప్పిగా ఉందంటూ ఆ రోజున ఆస్పత్రికి వచ్చింది. టాయిలెట్‌కు వెళ్లినప్పుడు అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా శిశువును కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసింది. తరువాత ఇద్దరూ వెళ్లిపోయారు. సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.