IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ – పాక్ మ్యాచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ – పాక్ మ్యాచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?


ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ముసాయిదా షెడ్యూల్ ప్రకారం ప్రారంభ, ముగింపు తేదీలు ఇప్పటికే వెల్లడయ్యాయి. 2025 ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ టోర్నీ చివరి మ్యాచ్ అంటే ఫైనల్ మార్చి 9న జరుగుతుంది. ఇప్పుడు మొత్తంగా ఈ 19 రోజుల్లో రెండు గ్రూపులుగా విడిపోయిన 8 జట్ల మధ్య పోటీ జరగనుంది. ఒక్కో గ్రూపులో 4 జట్లు ఉంటాయి. టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. అంటే, గ్రూప్ దశతో పాటు, నాకౌట్ దశలో కూడా ఇరుజట్ల మధ్య పోటీ ఉండవచ్చు.

భారత్-పాకిస్థాన్ ఎప్పుడు, ఎక్కడ ఢీకొంటాయి?

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొదటి పోరు ఎప్పుడు? ఇద్దరు చిరకాల ప్రత్యర్థుల మధ్య ఈ మ్యాచ్ ఏ నగరంలో, ఏ మైదానంలో జరుగుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ, భారత్‌తో మ్యాచ్‌లు తటస్థ వేదికలపైనే జరగనున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, దుబాయ్ పేరు తటస్థ వేదికగా ఆమోదించినట్లు తెలుస్తోంది. అంటే దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ముసాయిదా షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగాల్సి ఉంది.

రెండు గ్రూపులుగా 8 జట్లు..

ముసాయిదా షెడ్యూల్ ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అన్ని జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్‌, పాకిస్థాన్‌తో పాటు గ్రూప్‌-ఎలో న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కరాచీలో జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. రెండో మ్యాచ్‌లో ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో భారత్ మూడో, చివరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో జరగనుంది. టోర్నమెంట్‌లోని రెండవ గ్రూప్‌లోని అన్ని మ్యాచ్‌లు లాహోర్, కరాచీ, రావల్పిండిలో జరుగుతాయి.

భారత్ సెమీఫైనల్, ఫైనల్ చేరితే ఈ రెండు నాకౌట్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. ఒకవేళ భారత్ ఫైనల్ చేరకపోతే టైటిల్ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది. ముసాయిదా షెడ్యూల్ ప్రకారం ఇలా ఉండగా.. మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ షెడ్యూల్ కూడా ప్రపంచానికి వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్‌లు..

ఫిబ్రవరి 20న టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్‌

ఫిబ్రవరి 23న టీమిండియా వర్సెస్ పాకిస్థాన్‌

మార్చి 2న టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్‌.

గమనిక: ఇక్కడ అందించిన షెడ్యూల్ కేవలం డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారమే అని గుర్తించాలి. ఫైనల్ షెడ్యూల్ విడుదలయ్యాక పూర్తి వివరాలు అప్ డేట్ చేస్తాం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *