Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి మరోసారి కేసుల కష్టాలు.. నోటీసులు జారీ చేసిన బరేలి కోర్టు.. ఎందుకంటే?

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి మరోసారి కేసుల కష్టాలు.. నోటీసులు జారీ చేసిన బరేలి కోర్టు.. ఎందుకంటే?


కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీకి మళ్లీ కోర్టు కష్టాలు వచ్చాయి. కులగణనపై లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌ గాంధీ జనవరి 7వ తేదీన హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రాహుల్‌ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ.. పంకజ్‌ పాఠక్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ వ్యాఖ్యలను ప్రస్తావించారు పిటిషనర్‌. దీంతో విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో తాము అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన.. దేశ సంపదను పంచుతామని రాహుల్‌గాంధీ అన్నారు. ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు జనాభా ప్రాతిపదికన ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలుత ప్రజాప్రతినిధుల కోర్టులో పంకజ్‌ పాఠక్‌ పిటిషన్ దాఖలు చేయగా, విచారణకు తోసిపుచ్చింది. తాజాగా జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో అతడి పిటిషన్ ను విచారణకు కోర్టు స్వీకరించింది. ఈ క్రమంలో జనవరి 7న కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ రాహుల్ కు నోటీసులు జారీ చేసింది.

రాహుల్ వ్యాఖ్యలు దేశంలో అంతర్యుద్దాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని పిటిషన్‌లో పంకజ్ పాఠక్ పేర్కొన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కులగణన ఎట్టి పరిస్థితుల్లో చేపడుతామని అంటున్నారు రాహుల్‌గాంధీ.. అప్పుడే ఓబీసీలు , దళితులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఉత్తర ప్రదేశ్ కోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *