Model School Admissions: మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్న విద్యాశాఖ

Model School Admissions: మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్న విద్యాశాఖ


హైదరాబాద్‌, డిసెంబర్‌ 22: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం194 మోడల్‌ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. వివరణాత్మక నోటిఫికేషన్‌ డిసెంబర్‌ 23 (సోమవారం) జారీ చేస్తామని మోడల్‌ స్కూల్‌ అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.6వ తరగతిలో అన్నీ సీట్లకు ప్రవేశాలు ఉంటాయని, ఏడు నుంచి పదో తరగతి వరకు మాత్రం ఆయా స్కూళ్లలోని ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తామని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ విద్యార్థులు రూ.125, ఓసీలు రూ.200 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించి, అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

‘నీట్‌- యూజీ 2024 అడ్మిషన్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరపాలి..’ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం

నీట్‌-యూజీలో మిగిలిపోయిన ఖాళీ సీట్లను వెంటనే భర్తీ చేసేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విలువైన మెడికల్‌ సీట్లు వృథా కాకూడదని వ్యాఖ్యానించింది. మిగిలిపోయిన సీట్లకు డిసెంబరు 30లోగా ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. ఆయా మెడికల్‌ కాలేజీల్లో ఉన్న ఖాళీ సీట్లను నింపేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ బిఆర్‌ గవాయ్, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా నిర్వహించే ప్రత్యేక కౌన్సెలింగ్‌.. ఇప్పటికే ముగిసిన ప్రవేశాల ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపకూడదని హెచ్చరించింది. కేవలం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ మేరకు అన్ని మెడికల్ సీట్లను భర్తీ చేయాలని న్యాయస్థానం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *