ఈ ఏడాది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీ పోటీ నెలకొంది. అయితే ఈ ఏడాది చివరలో విడుదలైన పుష్ప 2 మాత్రం అన్ని చిత్రాలను వెనక్కు నెట్టేసింది. ఇక 2024 ముగియడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. మరో రెండు వారాల్లో నూతన సంవత్సరం రానుంది. తాజాగా బుక్ మై షో #BookMyShowThrowback పేరుతో ఇయర్ ఎండ్ రిపోర్టును రిలీజ్ చేసింది. ఇందులో పుష్ప 2 ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా అని బుక్ మై షో అనౌన్స్ చేసింది.
అంతకు ముందు ఈ రికార్డ్ స్త్రీ 2 పేరు మీద ఉండేది. బాలీవుడ్ లో విడుదలై రికార్డ్స్ తిరగరాసిన ఈ సినిమాను ఇప్పుడు పుష్ప 2 వెనక్కు నెట్టింది. బుక్ మై షో రిపోర్ట్ ప్రకారం.. పుష్ప 2 మూవీకి 10.8 లక్షల సోలో వ్యూస్ వచ్చినట్లు తెలిపింది. అంతకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2. అలాగే ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడైన సినిమాగా రికార్డ్ సాధించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.