హిందూ మతం ప్రపంచ శాంతిని కోరుకుంటుంది.. సేవే మానవాళి ధర్మంః మోహన్ భగవత్

హిందూ మతం ప్రపంచ శాంతిని కోరుకుంటుంది.. సేవే మానవాళి ధర్మంః మోహన్ భగవత్


భారతదేశంలో మైనారిటీల సమస్యలను పరిష్కరించాలంటూ తరచుగా సలహా ఇస్తారు, ప్రస్తుతం ఇతర దేశాలలో మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న పరిస్థితిపై ఎవరూ స్పందించడం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్ ) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్ర పుణేలో జరిగిన ‘హిందూ సేవా మహోత్సవ్’ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ శాంతి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి గురించి మన దేశానికి సలహా ఇస్తున్నారు. కానీ అయా దేశాల్లో యుద్ధాలు ఆగడం లేదన్నారు. మన దేశంలోని మైనారిటీల గురించి ఆందోళన చెందుతారు. బయట దేశాల్లో మైనార్టీలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఏ ఒక్కరూ ప్రశ్నించరని మోహన్ భగవత్ అన్నారు.

హిందూ స్పిరిచ్యువల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా హిందూ సేవా మహోత్సవ్‌ను పూణేలోని శిక్షణ్ ప్రసార మండలి కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 22 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా మోహన్ భగవత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సామాజిక సేవ గురించిన సమాచారం అందించారు. మహారాష్ట్రలోని అనేక దేవాలయాలు, సామాజిక, మత సంస్థలు, మఠాలు మరియు దేవాలయాల సేవా కార్యక్రమాలు ఈ పండుగలో భాగంగా ఉన్నాయి.

మానవాళికి సేవ చేస్తూ ప్రచారానికి దూరంగా ఉండాలని సర్సంఘచాలక్ అన్నారు. హిందూత్వం అనేది శాశ్వత ధర్మం. ఈ శాశ్వతమైన, సనాతన ధర్మానికి చెందిన ఆచార్యులు సేవా ధర్మాన్ని అనుసరించాలన్నా మోహన్ భగవత్. సేవా ధర్మం మానవత్వ ధర్మమని అయస అన్నారు. హిందూ సంస్కృతి, ఆచారాలు, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సేవ చేస్తున్నప్పుడు ప్రచారానికి దూరంగా ఉండడం మన స్వభావమన్న మోహన్ భగవత్, సేవ చేసే వారు, కనపడకుండా చేస్తారన్నారు. నిరంతరం ఎక్కువ సేవ చేయాలని కోరుకుంటారు. సేవా ధర్మాన్ని అనుసరిస్తూనే, మనం అతివాదులుగా ఉండకూడదన్నారు. మానవాళి ధర్మమే ప్రపంచ ధర్మం. అది సేవ ద్వారా వ్యక్తపరచాలని అన్నారు. హిందూ మతం ప్రపంచ శాంతిని కోరుకుంటుందని, అయితే మైనారిటీల పట్ల శ్రద్ధ వహించడం కూడా ముఖ్యమని ఆయన అన్నారు.

మన జీవనోపాధికి ఏది అవసరమో అది తప్పక చేస్తామని, అందుకు అనుగుణంగా రెట్టింపు సేవ కూడా చేయాలని డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. ప్రపంచం మన రక్షకుడనే భావన కలిగి ఉండాలి, వినియోగం కోసం కాదన్నారు. ఈ సందర్భంగా శిక్షణ ప్రసార మండలి అధ్యక్షుడు న్యాయవాది ఎస్‌కే జైన్, ఉపాధ్యక్షుడు శ్రీ కృష్ణ చితాలే, హిందూ సేవా మహోత్సవ్ అధ్యక్షుడు కృష్ణకుమార్ గోయల్, స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్, జ్యోతిష్యుడు లభేష్ ముని మహరాజ్, ఇస్కాన్ గౌరంగ్ ప్రభు, హిందూ ఆధ్యాత్మిక సేవా సంస్థ జాతీయ కన్వీనర్ గున్వాన్ కొఠారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ మాట్లాడుతూ దేశం అంటే భూమి, సమాజం, సంప్రదాయాలతో నిర్మితమైందన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పూణే భూమికి సేవ చేశారు. రాజమాత జిజియా ఈ పవిత్ర భూమిలో గణేశుడిని స్థాపించారు. అన్ని ఆచారాలకు పరాకాష్ట సేవే ఆరాధన అన్నారు. ఇస్కాన్ చీఫ్ గౌరంగ ప్రభు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మంలో దాతృత్వం, నైతికత, స్వీయ-సాక్షాత్కారం అనే మూడు స్తంభాలాంటివన్నారు. లభేష్ ముని మహరాజ్ మాట్లాడుతూ మన మహిమాన్విత మతం ఒక్కటేనని, సేవా కుంభ్ ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా గున్వంత్ కొఠారి దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సేవా మహోత్సవ్ గురించి సమాచారం అందించి దాని ఆవశ్యకతను వివరించారు. ఉత్సవంలో కృష్ణకుమార్ గోయల్ ప్రారంభోపన్యాసం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *