Tollywood: 2 సినిమాలు ప్లాప్.. 30 కోట్ల నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో.. ఎవరంటే..

Tollywood: 2 సినిమాలు ప్లాప్.. 30 కోట్ల నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో.. ఎవరంటే..


ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరో. వరుసగా సినిమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సీనియర్ నటుడి కుమారుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ వరుస ప్లాప్ చిత్రాలు ఇప్పుడు అతడి కెరీర్ ను ప్రశ్నార్థకం చేశాయి. ఒకప్పుడు ఒక్క సినిమాకు రూ.30 కోట్ల పారితోషికం తీసుకున్న ఆ హీరో.. ఇప్పుడు కేవలం రూ.9 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. అతడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ టైగర్. . ‘హీరోపంతి 2’, ‘బడే మియాన్ ఛోటే మియాన్’ వంటి సినిమాలు అతని కెరీర్‌ను పతనానికి గురి చేశాయి. దీంతో రెమ్యునరేష్ భారీగా పడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒక్క హిట్ కూడా అఏందుకోలేదు. 2014లో ‘హీరోపంతి’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు టైగర్.

తెలుగులో వచ్చిన ‘పరుగు’ సినిమాకు రీమేక్ ఇది. ఈ మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘బాఘీ’, ‘బాఘీ 2’ సినిమాలు టైగర్‌ని స్టార్ హీరోగా నిలబెట్టాయి. నటన, డ్యాన్స్‌, యాక్షన్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత రెండు మూడేళ్లుగా టైగర్ నటించిన ‘హీరోపంతి 2’, ‘గణపత్‌’, ‘బడే మియాన్‌ ఛోటే మియాన్‌’, ‘సింగమ్‌ ఎగైన్‌’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో టైగర్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.

దీంతో ఇటు టైగర్ రెమ్యునరేషన్ సైతం పడిపోయింది. ఒకప్పుడు ఒక్క సినిమాకు రూ.30 కోట్లు పారితోషికం తీసుకున్న టైగర్ ష్రాఫ్.. ఇప్పుడు కేవలం రూ.9 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం ‘బాఘీ 4’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది. దీంతో టైగర్ మరో హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *