Tech Tips: ఒక ఫోన్‌ని మరో ఫోన్‌కి ఛార్జ్ చేయడం ఎలా?.. ఇదిగో ట్రిక్

Tech Tips: ఒక ఫోన్‌ని మరో ఫోన్‌కి ఛార్జ్ చేయడం ఎలా?.. ఇదిగో ట్రిక్


నేటి బిజీ షెడ్యూల్ మధ్య మనం చాలా సార్లు స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఛార్జర్‌ని తీసుకెళ్లడం మర్చిపోతుంటాము. అటువంటి పరిస్థితిలో ఫోన్‌ను ఎలా ఛార్జ్ చేయాలో తెలియక మనం గందరగోళానికి గురవుతాము. కానీ, ఇప్పుడు మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ లేకుండా మీ ఫోన్‌ను ఛార్జ్ చేసే ట్రిక్ గురించి తెలుసుకుందాం. దీని కోసం మీ ఫోన్ కాకుండా మీకు మరొక ఫోన్ అవసరం. అప్పుడు మీరు మీ ఫోన్‌ను సులభంగా ఛార్జ్ చేయవచ్చు.

ఫోన్ నుండి ఫోన్ ఛార్జ్ చేయడం ఎలా?:

మీరు రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించవచ్చు. అలాగే వాటిలో ఒకటి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే వాటిని సులభంగా ఛార్జ్ చేయవచ్చు. మార్కెట్‌లో వస్తున్న తాజా స్మార్ట్‌ఫోన్‌లలో మీకు వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్ లభిస్తుంది. మీ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తే ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి. ఇక్కడ మీరు కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే, మీకు బ్యాటరీ ఎంపిక కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ ఎంపికపై క్లిక్ చేయండి. అప్పుడు ఛార్జింగ్ సెట్టింగ్‌ల ఎంపికపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చివరకు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్‌ కనిపిస్తుంది. రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్‌ను ప్రారంభించండి. ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీరు ఫోన్‌ను టేబుల్‌పై తలక్రిందులుగా ఉంచాలి. దాని పైన మరొక ఫోన్ ఉంచండి.

అప్పుడు మీ ఫోన్ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను పవర్‌షేర్ ఫీచర్ అని కూడా అంటారు. దాని పేరు సూచించినట్లుగా, ఇది ఒక ఫోన్‌ నుండి మరొక ఫోన్‌కు పవన్‌ను పంపుతుంది. మీరు చాలా Android స్మార్ట్‌ఫోన్‌లలో ఈ ఫీచర్‌ను కనుగొంటారు. ఈ ఫీచర్ Samsung Galaxy S23, అన్ని తదుపరి మోడల్‌లలో అందుబాటులో ఉంది.

అత్యవసర పరిస్థితుల్లో ప్రయోజనం:

మీరు అత్యవసర పరిస్థితుల్లో ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. రెగ్యులర్‌గా మీరు మీ ఫోన్‌ను డెడికేటెడ్ ఛార్జర్ ద్వారా మాత్రమే ఛార్జ్ చేయాలి. లేదంటే అది బ్యాటరీపై ప్రభావం చూపుతుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *