Viral Video: ప్లీజ్ జర పక్కకు జరగండి.. ఈ గజరాజును వినమ్రతకు ఫిదా అవ్వాల్సిందే

Viral Video: ప్లీజ్ జర పక్కకు జరగండి.. ఈ గజరాజును వినమ్రతకు ఫిదా అవ్వాల్సిందే


ప్రకృతి మనల్ని ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఇటీవలి వైరల్ వీడియో అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచించి. అందులో ఒక ఏనుగు ప్రశాంతంగా ఒక దారిలో నడుచుకుంటూ వస్తూ దారిలో నిలిచి ఉన్న ఒక వ్యక్తిని తన దారి నుంచి దూరంగా వెళ్ళమని కోరింది. ఏనుగు సిగ్నల్ అనుసరించి మనిషి తక్షణమే తప్పుకోవడం స్వాగతించేలా చేస్తుంది.

జంతువులు తెలివి తేటలు, జ్ఞానానికి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫన్నీ వీడియోలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ అద్భుతమైన వీడియో.. ఏనుగు అద్భుతమైన జ్ఞానన్ని కలిగి ఉందని రుజువు చేస్తుంది. ఏనుగు చేసిన కదలిక చాలా సున్నితమైనది. ఏనుగు చేసిన సైగ ఆన్‌లైన్‌లో చాలా మంది హృదయాలను దోచుకుంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా X లో @AmazingNature లో షేర్ చేసిన ఈ 23-సెకన్ల వీడియో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల హృదయాలను ఆకర్షించింది. ఏనుగు తాను వెళ్ళే దారిలో మానవుడు ఉండడం చూసి తప్పుకోమని సున్నితంగా అడిగింది” అని క్యాప్షన్ ఇచ్చారు. సున్నితమైన విధానం కారణంగా ఏనుగు చర్యకు ప్రశంసలను పొందింది. ఈ ప్రవర్తన ప్రకృతి సహజంగా వచ్చిన సున్నితత్వంతో నిండి ఉందని రుజువు చేస్తుందని అంటున్నారు.

ఈ విధంగా వీడియో కేవలం వినోదాత్మకంగా మాత్రమే కాదు జంతువుల అభిజ్ఞా సామర్థ్యాలను, వాటి భావోద్వేగ మేధస్సు ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తుంది. సహజ ప్రపంచం గురించి మరింత తెలుసుకోవడం కొనసాగిస్తున్నప్పుడు..ఇటువంటి చర్యలు వన్యప్రాణులతో కలిసి జీవించడం ఎంత ముఖ్యమో.. తెలియజేస్తుంది.

వీడియోపై స్పందించిన ఒక వినియోగదారు ఎంత సున్నితమైన దిగ్గజం! ఎంత మనోహరమైన క్షణం అంటూ కామెంట్ చేశారు. మరొకరు నేను ఏనుగులను చాలా ప్రేమిస్తున్నాను.. చాలా తెలివైన, నమ్మకమైన జంతువు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో నన్ను చాలా చాలా ఆకట్టుకుంది అని ఒకరు.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *